విన్నర్ రివ్యూ & రేటింగ్.

winner movie perfect review and rating విన్నర్ రివ్యూ

Alajadi Rating

2.5/5

Cast: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్, జగపతి బాబు,ముకేశ్ రుషి, అలీ, పృథ్వి, వెన్నెల కిషోర్..తదితరులు.

Directed by: గోపీచంద్ మలినేని

Produced by: నల్లమలుపు బుజ్జి

Banner: లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్

Music Composed by: థమన్

ఒక్కొక్క సినిమాతో అభిమానులని పెంచుకుంటూ స్టార్ హీరో లీగ్ లోకి ఎంటర్ అవ్వడానికి దూసుకెళ్తున్నాడు సాయి ధరమ్ తేజ్, బలుపు, పండగ చేస్కో లాంటి హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెలుగులో ఇప్పటివరకు ఎవరు చేయని కథతో ‘విన్నర్’ అనే సినిమాని తీసాడు, ఈరోజు విడుదల అయిన ‘విన్నర్’ ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

చిన్నతనంలోనే తల్లిదండ్రులకి దూరం అయ్యి అనుకోని పరిస్థితుల మధ్య పెరుగుతాడు రామ్ (సాయి ధరమ్ తేజ్), ఒక ఉద్యోగంలో చేరుతున్న క్రమంలో క్రీడాకారిణి అయిన సితార (రకుల్ ప్రీత్) తో ప్రేమలో పడుతాడు, ప్రేమ కోసం సితార తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు, ఆ ఛాలెంజ్ ఏంటి..? జగపతిబాబుతో రామ్ కి ఎందుకు గొడవ అవుతుంది..? హార్స్ రేస్ కి రామ్ కి సంబంధం ఏంటి..?  అనేది మిగిలిన కథ

అలజడి విశ్లేషణ:

హీరో హీరోయిన్ ని చూసి ఇష్టపడటం, హీరోయిన్ తండ్రితో ఛాలెంజ్ చేయడం, మధ్యలో విలన్ ఎంటర్ అవ్వడం, హీరో విలన్ మీద గెలిచి హీరోయిన్ ని పొందడం ఇది మన తెలుగు సినిమాల్లో ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న కథ, ఇదే కథని కాస్త అటుఇటుగా మార్చి విన్నర్ సినిమాని తీశారు, కానీ కథని ప్రెజెంట్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉండటంతో సినిమా ఎక్కడ బోర్ కొట్టదు.

అలీ, పృథ్వి, వెన్నెల కిషోర్, ప్రియదర్శిలు కలిసి పండించిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది, సాయి ధరమ్ తేజ్ సరికొత్తగా చేసిన యాక్షన్ ఎపిసోడ్లు కొత్తగా అనిపిస్తాయి, హార్స్ రేస్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ చేసే విన్యాసాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి, రకుల్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది, కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు కథకి ఎక్కువగా కనెక్ట్ కాలేరు.

నటీనటుల పనితీరు:

సాయి ధరమ్ తేజ్: సాయి ధరమ్ తేజ్ చుట్టే మొత్తం సినిమా నడుస్తుంది, సాయి ధరమ్ తేజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్లు సినిమాకే హైలైట్, డాన్స్ లు కూడా అదరగొట్టాడు.

రకుల్ ప్రీత్ సింగ్: గ్లామర్ విషయంలో రకుల్ కి ఫుల్ మార్క్స్ ఇచ్చేయొచ్చు, సాయి ధరమ్ తేజ్ కి పోటీగా డాన్స్ లలో అదరగొట్టింది.

జగపతి బాబు: స్టైలిష్ విలన్ గా ఇప్పటికే జగపతి బాబు తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు, మరోసారి తన నటనతో సినిమాకి హైలైట్ గా నిలిచాడు.

అలీ, పృద్వి, వెన్నెల కిషోర్ , ప్రియదర్శి..తదితరులు తమ పాత్రల మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • కామెడీ
  • సాయి ధరమ్ తేజ్ నటన
  • మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • బోర్ కొట్టించే సన్నివేశాలు

పంచ్ లైన్ : ఇలాంటి కథలతో అడుగడుగునా సినిమాలు తీస్తారు..అరుదైన కథలతో సినిమాలు తీసే వారే ‘విన్నర్’ గా నిలుస్తారు.

(Visited 2,676 times, 87 visits today)

Comments

comments