EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

Video: రాజధానిలో కీచక పర్వం

Author:

ఎన్ని చర్యలు, చట్టాలు చేసిన మహిళలపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు, ఇంట్లో ఉన్న, రోడ్ మీద వెళ్తున్న, ఆఫీస్ లలో, బస్ స్టాప్ లలో, కాలేజీలలో, క్యాబ్ లలో… ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి, ముఖ్యంగా పనిచేసే చోట తమ కింది స్థాయి మహిళలని పై స్థాయి వ్యక్తులు తమ అధికారం చూపించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు, ఇలాంటి ఘటనే మన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

ఢిల్లీలో ఉండే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మహిళా సెక్యురిటీ ఆఫీసర్ గా పనిచేస్తుంది, ఆ హోటల్ లో సెక్యూరిటీ మేనేజర్ గా పనిచేసే పవన్ దహియా అనే వ్యక్తి జులై 29న ఆమెపై హోటల్ లోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కీచక పర్వానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటికి వచ్చింది, ఈ విషయంపై ఒక ఛానెల్ తో బాధితురాలు మాట్లాడుతూ ” జులై 29న నా పుట్టిన రోజు. అది తెలుసుకున్న పవన్‌ దహియా తన డెబిట్‌ కార్డు తీసి ఇష్టమైన గిఫ్ట్‌ కొనుక్కోమని నాకు సూచించాడు. ఆ తర్వాత పవన్‌ కూర్చోవల్సిందిగా కోరడంతో నేను నిరాకరించాను. వెంటనే అతడు నన్ను తన వైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు. నేను తీవ్రంగా ప్రతిఘటించాను. ఆ సమయంలో అక్కడ ఉన్న సహోద్యోగులను బయటికి వెళ్లిపోమని ఆదేశించాడు. అనంతరం నా చీర కొంగు పట్టుకుని లాగాడు. అతను ఇలా వేధించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుసార్లు శారీరకంగా బాధపెట్టేవాడు.. అసభ్యకరంగా మాట్లాడేవాడు. ఈ సంఘటన జరిగిన రోజు రాత్రే నేను హోటల్‌ హెచ్‌ఆర్‌ విభాగానికి ఫిర్యాదు చేశాను. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నేను జరిగిందంతా నా భర్తకు వివరించాను. ఆగస్టు 1న పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని తెలిపింది, ఈ అఘాయిత్యానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని ఒక హోటల్ సెక్యూరిటీ సిబ్బంది ఆ మహిళాకి అందజేయడంతో పోలీసులు కేసుని నమోదు చేసారు.

ఈ కీచక పర్వం విషయంలో బాధితురాలుకి అండగా నిలవాల్సిన హోటల్ యాజమాన్యం ఆఘాయిత్యం జరిగిన మరుసటి రోజే ఆమెని ఆకారణంగా విధుల నుండి తొలగించారు, అలాగే బాధితురాలికి వీడియో ఫుటేజీ అందించిన వ్యక్తిని కూడా విధుల నుండి తొలగించి మహిళాని వేధించిన వ్యక్తికి అండగా నిలవడం గమనార్హం.

(Visited 1,405 times, 136 visits today)

Comments

comments