ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్.

Author:

స్మార్ట్ ఫోన్స్ విక్రయాలలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరిన సంస్థగా గ్జియోమి నిలిచింది, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ని అందించి సంచలనాలు సృష్టించింది, ఇప్పటికే చాలా ఆఫర్స్ తో స్మార్ట్ ఫోన్స్ ని అమ్మిన గ్జియోమి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తో వస్తుంది, ఈసారి కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ ని ఇచ్చే ఆఫర్ ని ప్రవేశపెట్టింది.

xiaomi flash sale

ఫ్లాష్ సేల్ పేరుతో అక్టోబ‌ర్ 17 నుంచి 19 వ‌ర‌కు గ్జియోమీ రెడ్‌మీ 3ఎస్ (xiaomi Redmi 3S ), గ్జియోమీ రెడ్‌మీ నోట్ 3 (xiaomi Redmi Note 3 ), ఎమ్ ఐ (MI 4 )స్మార్ట్ ఫోన్ల‌ను ఎమ్ఐ డాట్ కామ్‌, (www.mi.com)ఎమ్ఐ యాప్ ద్వారా విక్ర‌యించ‌నుంది. రూపాయే క‌దా అని ఆర్డ‌ర్ చేస్తే ఫోన్ రాదు.. అంత‌కంటే ముందు మీరు చేయాల్సింది మ‌రొక‌టుంది. ఈ ఆఫ‌ర్ ఉన్న మూడు రోజుల‌పాటు రోజుకు 30 ఫోన్ల‌ను విక్ర‌యిస్తుంది. మూడు మోడ‌ళ్ల ఫోన్ల సేల్ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. ఈ ఫ్లాష్‌సేల్‌తో పాటు ఇంకొన్ని ప్రాడ‌క్ట్స్‌ను కూడా విక్ర‌యిస్తోంది గ్జియోమీ సంస్థ‌. ఇందుకు కొన్ని కండీష‌న్స్ కూడా పెట్టింది సంస్థ‌.

ఎవ‌రు ఈ ఆఫ‌ర్‌కు అర్హులు:

  • ముందుగా ఈ ఆఫ‌ర్ గురించి సోష‌ల్ మీడియాలో (FACEBOOK, TWITTER ) మీరు ప‌బ్లిసిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
  • ఇలా సోష‌ల్ మీడియాలో ప‌బ్లిసిటీ చేసిన త‌ర్వాత రిజిస్ట్రేష‌న్‌కు అర్హులు అవుతారు
  • ఫ్లాష్ సేల్‌కు అర్హులైన వారి జాబితాను MI క‌మ్యూనిటీలో ఉంచుతారు
  • అర్హులైన వారు జాబితా ఉంచిన రెండుగంట‌ల్లోపు ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది లేదంటే మీరు అన‌ర్హుల‌వుతారు.

ఏ ఫోన్ ఎప్పుడు ఆర్డ‌ర్ చేసుకోవాలి.

  • అక్టోబ‌ర్ 17 – గ్జియోమీ రెడ్‌మీ 3ఎస్ (xiaomi Redmi 3S )
  • అక్టోబ‌ర్ 18 – గ్జియోమీ రెడ్‌మీ నోట్ 3 (xiaomi Redmi Note 3 )
  • అక్టోబ‌ర్ 19 – ఎమ్ ఐ (MI 4 )

ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవాలనుకునే వారు అక్టోబర్ 17 నుండి 19 వరకు ఆ సంస్థ పెట్టిన కండిషన్స్ ప్రకారం చేయాల్సి ఉంటుంది.

Must Read: స్విమ్మింగ్ లో 50 గోల్డ్ మెడల్స్ సాధించిన చేతితో ఇప్పుడు కార్లని తుడుస్తున్నాడు.

(Visited 2,519 times, 89 visits today)

Comments

comments