Home / Videos / Video: సిమ్ వేస్తుండగా పేలిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్.

Video: సిమ్ వేస్తుండగా పేలిన రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్.

Author:

తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు ఇస్తూ స్మార్ట్ ఫోన్ అమ్మకాలలో కొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న షియోమీ రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది. కొత్త రెడ్ మీ నోట్ 4 ఫోన్ లో సిమ్ వేస్తుండగా ఫోన్ పేలిన సంఘటన బెంగళూరులో జరిగింది, బెంగళూరులో ఉన్న ఒక మొబైల్ స్టోర్ లో అర్జున్ అనే యువకుడు ఇటీవల రెడ్ మీ నోట్ 4 ఫోన్ కొనుగోలు చేసాడు, దానిలో సిమ్ వేయించడానికి స్థానిక మొబైల్ షాప్ కి వెళ్ళాడు, ఆ షాప్ సిబ్బంది సిమ్ స్లాట్ ఓపెన్ చేయగానే ఫోన్ లో మంటలు వచ్చి పేలిపోయింది. ఫోన్ పేలిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఈ పేలుడు కారణంగా ఫోన్ పూర్తిగా కాలిపోగా.. ఎవరికీ గాయాలు కాలేదని సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. జూలై 23న ఈ ఘటన చోటు చేసుకోగా.. విషయం తెలుసుకున్న సంస్థ.. మరో కొత్త ఫోన్‌ను కస్టమర్‌కు అందించింది. వినియోగదారుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని షియోమీ స్పష్టం చేసింది. ఫోన్ ఎలా కాలిపోయిందనే విషయమై ఆ సంస్థ దర్యాప్తు చేపట్టింది.

రెడ్ మీ నోట్ 4 పేలింది

చాలా వరకు ఫోన్లు ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఓవర్ హీట్ కారణంగా పేలుతుంటాయి. కానీ నోట్ 4 మాత్రం.. ఛార్జర్‌కు కనెక్ట్ కాకుండానే ఫోన్ పేలడంతో కస్టమర్లు భయాందోళనకు లోనవుతున్నారు.

(Visited 1,001 times, 10 visits today)