ఈ నాలుగు ఆసనాలు వేస్తే చాలు వెంటనే సన్నబడిపోతారు.

Author:

ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా అనారోగ్యాలే.. ముఖ్యంగా అన్నింటికీ ప్రధాన కారణం ఊబకాయం. సింపుల్ గా చెప్పాలంటే ఏ ఇంట్లో అయినా.. ఏ ఒంట్లో అయినా అధిక బరువు సమస్యలే. మారుతున్న ఆహారపు అలవాట్లు, పని తీరు, పని వేళలు.. ఇలా కారణాలేమైనా అందరినీ వేధిస్తోన్న సమస్య ఊబకాయం. ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, పని ఒత్తిడి, స్ట్రెస్, పని హదావుడిలో తినేయడం… ఆ తిండిని అరిగించుకోలేక అపసాపోలు పడడం అందరికీ అలవాటైపోయింది. దీంతో, శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ ఒబెసిటి లేదా ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. ఏంచేయాలో తెలియక జిమ్ములు, స్లిమ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. జేబులు ఖాళీ అవుతున్నాయి కానీ, బరువు తగ్గట్లేదు. అయితే ఇప్పుడు ఏం కంగారు అక్కర్లేదు.. ఆరోగ్యం తోపాటూ మీ అందాన్ని కాపాడుకోవడానికి ఓ అద్భుతమైన సాధనం ఉంది అంటున్నారు డాక్టర్లు, నిపుణులు. అదే మన యోగాన్ని మార్చేసే యోగా.

yoga

దీనికి పెద్ద ఖర్చు కూడా కాదు కానీ క్రమం తప్పక ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఇంట్లోనే చిన్న చిటకా యోగాసనాలు వేస్తూ శరీర బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాదు, చర్మ సౌందర్యం కూడా పెరుగుతుంది. రోజు ఈ నాలుగే నాలుగు ఆసనాలు డైలీ వేస్తె అందం ఆరోగ్యం మీ సొంతమాట. అవే ఆంజనేయ ఆసనం, పరిపూర్ణ నావాసనం, చతురంగ దండాసనం, సేతు బంధాసనం.

ఎవరైనా ఈ ఆసనాలు వేయవచ్చు కానీ గర్భవతులు, మధుమేహం, రక్తపోటు, నడుము నొప్పి వంటి ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఆసనాలకు దూరంగా ఉండాలి. వీరు కూడా నిపుణుల సలహా తీసుకున్నాకే ఈ ఆసనాలు వేయవచ్చు. ఈ నాలుగు అత్యద్భుతమైన ఆసనాలను మీకోసం అలజడి ప్రత్యేకంగా వీడియోల రూపంలో అందిస్తోంది. ఇంకేదుకు ఆలస్యం ఈరోజు నుండే ఈ యోగాసనాలు మొదలు పెట్టండి.

(Visited 1,251 times, 827 visits today)

Comments

comments