EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే ఉద్యోగం ఊడినట్టే…!

Author:

హైదరాబాద్ లో అతిగా  మద్యం తాగి వాహనాలు నడిపిన వారిలో జైలుశిక్ష అనుభవించిన వారు భవిష్యత్తులో విదేశాలకు వెళ్లాలంటే వారికి వీసా వచ్చే అవకాశాలు కష్టమే  ఎందుకంటే ఇక ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు పడితే అది మీ జీవితానికి ఇప్పుడు పెద్ద సమస్యగా మారనుంది. ఒక్క పెగ్గు మీ జీవితాన్నే మార్చనుంది.ఈ విషయం గురించి హైదరాబాద్ కమిషనర్ యం. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన మార్గదర్శకాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎం.మహేందర్‌ రెడ్డి తెలిపారు.

Drunk and Drive Hyderabad 1

ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి సిటీ కోర్ట్  పనిష్మెంట్ ఇచ్చిందో, అలాగే ఎవరైతే రఫ్ గా వాహానలను నడిపినవారు, సిగ్నల్ జంప్ చేసిన వారు కూడా ఇందులోకి రానున్నారు. తాగి వాహనాలు నడుపుతూ(డ్రంక్ అండ్ డ్రైవ్) పట్టుబడి, జైలుకు వెళ్లిన వారి వివరాలన్నీ ప్రస్తుతం క్రోడీకరిస్తున్నామని, ప్రత్యేక విభాగం అధికారుల ద్వారా వారి పాస్‌పోర్టుల నంబర్లను సేకరిస్తున్నామని తెలిపారు. జైలుశిక్ష అనుభవించిన వారు ఎప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో పట్టుబడ్డారు, ఎన్నిసార్లు శిక్ష అనుభవించారు అన్న వివరాలన్నీ రికార్డుల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Drunk and Drive Hyderabad 1

2011 నుండి ఇప్పటి వరకు మొత్తం 70,712మంది తాగి వాహానలు నడుపుతూ దొరికారు. అందులో  14,570 మంది జైల్ కి వెళ్ళారు. పోలీసుల డేటా ప్రకారం మన హైదరాబాద్ మొత్తంలో 62,000 మంది దొరికారు అందులో 30,078 మంది 18-30 ఏండ్ల వయసు వారు  30 వేలకు మందికి పైగా ఉండటం గమనించదగ్గ విషయం. “మంచి భవిష్యత్తు ఉన్న యువకులు ఇలా మందు తాగి దొరకడం వలన వారు రానున్న రోజులలో మంచి జీవితం(ఉద్యోగం) పోగొట్టుకున్నవారు కానున్నారు”. అని సిపి(ట్రాఫిక్ ) జీతేందర్ అన్నారు.

అలాగే ఇలా తాగి దొరకటం వలన ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా అవుతున్నారు. మరియు విదేశీ పర్యటనలతో పాటు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విదేశాల్లో కొలువులకు వెళ్లేవారు జైలుశిక్ష అనుభవించి ఉంటే వీసా అనుమతిపై ప్రభావం చూపుతుంది. ఇంతేకాదు.. ఎవరైనా విద్యార్థులు జైలుశిక్ష అనుభవించి ఉన్నత చదువులకు వెళ్లేందుకు యత్నించినా వీసా వచ్చే అవకాశాలు లేవు.అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పట్టుపడితే అది వాళ్ళ ప్రమోషన్స్ పై ప్రభావం పడేట్లుగా సరికొత్త విధానాన్ని రూపొందించనున్నారు.

(Visited 927 times, 124 visits today)

Comments

comments