EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / టీజర్: వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’

టీజర్: వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’

Author:

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న బయోపిక్ ‘యాత్ర’ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. మళయాళ స్టార్‌ మమ్ముటీ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రం ఆనందోబ్రహ్మ ఫేమ్‌ మహి వీ రాఘవ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రజానేత జీవితంలోని మహాప్రస్థానం(పాదయాత్ర) అనే కీలక ఘట్టం ఆధారంగా యాత్రను మహి రూపొందిస్తున్నారు. టీజర్‌ విషయానికొస్తే…

పాదయాత్ర ప్రారంభించే ముందు వైఎస్సార్‌ మాటల్ని గుర్తు చేస్తూ టీజర్‌ ప్రారంభమైంది. ‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు, ఓడిపోతే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో… చరిత్రే నిర్ణయిస్తుంది’ అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో డైలాగులు వినిపించాయి. పంచెకట్టులో రాజన్నను తలపిస్తూ.. అదే దరహాసం.. అదే తరహా అభివాదం ఓవరాల్‌గా మమ్ముట్టి.. లుక్‌ ఆకర్షించింది.

(Visited 1 times, 332 visits today)