Home / Latest Alajadi / రెండు ఫోటోలు మారినందుకు…! రెండు కోట్ల ప్రజాధనం వృధా అయింది…!

రెండు ఫోటోలు మారినందుకు…! రెండు కోట్ల ప్రజాధనం వృధా అయింది…!

Author:

తెలుగు రాష్ట్రాల్లో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాదాపు రెండు కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది, తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవికి నిన్న ఎన్నికలు జరిగాయి, అయితే ఈ ఎన్నికలలో ఓటర్లకి ఇచ్చే బ్యాలెట్ పేపర్ పై తప్పులు దొర్లటంతో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నికని వాయిదా వేసింది.బ్యాలెట్ పేపర్ లో భ్యర్థుల పేర్లు, ఫోటోలు తారుమారయ్యాయి. 9వ నెంబర్ అభ్యర్థిగా ఉన్న మాణిక్ రెడ్డి పేరు ఎదురుగా లక్ష్మయ్య అనే అభ్యర్థి ఫోటో వచ్చింది. లక్ష్మయ్య పేరు దగ్గర మాణిక్ రెడ్డి ఫోటో పడింది. ఈ తప్పుని గుర్తించిన ఓటర్లు అధికారులకి చెప్పడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి కేంద్ర ఎన్నికల కమిషన్ తో సంప్రదించి ఈ నెల 19 వ తేదీన మళ్ళీ ఎన్నికలని నిర్వహిస్తాం అని ప్రకటించారు.

2Crores-Public-Money-Wasted-By-Officials

బ్యాలెట్ పేపర్ ని సరిగ్గా చూడకుండానే ఎన్నికలకి ఏర్పాట్లు చేసిన అధికారులు నిర్లక్ష్యం కారణంగా దాదాపు రూ.2 కోట్ల రూపాయలు వృధా అయినట్లే, ఈ ఎన్నిక కోసం 126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ఎన్నికల విధులను నిర్వహించేందుకు పోలీసులు, బూత్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ అధికారులతో కలిపి దాదాపు 50 వేల మంది సిబ్బంది పని చేసారు, వీళ్ళకే దాదాపు 1 .5 కోట్ల రూపాయలని ఎన్నికల భత్యంగా చెల్లించాలి, ఇంకా ప్రింటింగ్ ఖర్చులు, సిబ్బందికి చాయ్ లు, భోజనాల ఖర్చుని కలుపుకుంటే రూ.రెండు కోట్ల ప్రజాధనం వృధా అయినట్లే, మళ్ళీ అంతే మొత్తంలో ప్రజాధనం ఖర్చు చేసి ఎన్నికని నిర్వహించాల్సి ఉంటుంది.

(Visited 528 times, 1 visits today)