Home / Entertainment / 24 సినిమా రివ్యూ & రేటింగ్.

24 సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

24 movie perfect review and rating

’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాలతో దర్శకుడిగా తనదంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ’24’ అనే సైన్స్ ఫిక్షన్ కథతో మనముందుకు వచ్చారు. సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

కథ:

డాక్టర్ శివకుమార్ (సూర్య) ఓ శాస్త్రవేత్త. తన ఇంటినే ప్రయోగశాలగా మార్చి.. కాలంలో ప్రయాణం చేసే గడియారాన్ని తయారు చేస్తాడు. ఐతే దీని గురించి ముందే తెలుసుకున్న అతడి కవల సోదరుడు ఆత్రేయ (సూర్య) తన సోదరుడి మీద దాడి చేస్తాడు. వాచ్ కోసం తన శివకుమార్ తో పాటు అతడి భార్య ప్రియ (నిత్యామీనన్)ను కూడా చంపేస్తాడు. ఐతే శివకుమార్ తాను చనిపోతూ పసివాడైన తన కొడుకు మణిని – ఆ వాచ్ ను ఓ అమ్మాయికి అప్పగిస్తాడు. తనను కాపాడిన అమ్మాయినే అమ్మగా భావించి తన దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. ఐతే తన దగ్గరున్న వాచ్ ద్వారా కాలంలో ప్రయాణించవచ్చని అనుకోకుండా మణికి తెలుస్తుంది. దాంతో అతను ప్రయోగాలు చేస్తుంటాడు. మరోవైపు శివకుమార్ ను చంపిన అనంతరం ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన ఆత్రేయ 26 ఏళ్ల తర్వాత తెలివిలోకి వస్తాడు. అతడికి మణి దగ్గర వాచ్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఆ వాచ్ కోసం ఆత్రేయ-మణి మధ్య పోరు మొదలవుతుంది. చివరికి ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

అలజడి విశ్లేషణ:

విక్రం కుమార్ మరోసారి తన మ్యాజిక్ ను చూపించాడు. 24 అంటూ టైటిల్ పెట్టిన నాటి నుండి ఇంట్రెస్ట్ ను క్రియెట్ చేసిన విక్రం కుమార్ దాన్ని తెర మీద ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేశాడన్నది సినిమా చూస్తే అర్ధమవుతుంది. ఇక సర్ ప్రైజెస్ అయితే సినిమాలో చాలానే ప్లాన్ చేశాడు. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్ లో ఆడియెన్స్ థ్రిల్ ఫీల్ అవ్వక తప్పదు. అయితే ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. అక్కడక్కడ సినిమా కొన్ని హాలీవుడ్ సినిమాల వాసన తగులుతుంది. కాని కోలీవుడ్లోనే కాదు సౌత్ లోనే ఇలాంటి అటెంప్ట్ తో తన గట్స్ చూపించాడు సూర్య.

సాంకేతిక వర్గం పనితీరు:

రొటీన్ సినిమాలకు భిన్నంగా ఏదో ఒక ప్రయోగంతో అలరించే దర్శకుడు విక్రమ్ కె కుమార్, 24 సినిమా విషయంలోనే అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. మెయిన్ కథ విషయంలో మంచి పట్టు చూపించిన దర్శకుడు, లవ్ సీన్స్ను మాత్రం బోరింగ్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో హీరో ఒకే డైలాగ్ ను పదే పదే చెప్పటం విసుగు తెప్పిస్తుంది. రెహమాన్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • సూర్య
  • ఏ.ఆర్.రెహమాన్
  • సినిమాటోగ్రఫీ
  • స్టోరీ, స్క్రీన్ ప్లే

మైనస్ పాయింట్స్:

  • ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్
  • లాజిక్స్ మిస్ అవ్వడం.

అలజడి రేటింగ్:3.75/5

పంచ్ లైన్: “ప్యూర్ 24 క్యారెట్స్ లాంటి సినిమా.

(Visited 3,746 times, 1 visits today)