Home / General / 1.76 లక్షల కోట్ల 2G స్కామ్ లో అందరు నిర్దోషులే..!

1.76 లక్షల కోట్ల 2G స్కామ్ లో అందరు నిర్దోషులే..!

Author:

దేశ అవినీతి చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన 2జీ స్కామ్ కేసులో నిందితులందరిని నిర్దోషులుగా ప్రకటించడం సంచలనంగా మారింది, ఈ కేసులో పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది, దాదాపు పది సంవత్సరాల యూపీఏ హయంలో టెలికం మంత్రిగా ఉన్న ఏ రాజా 2G స్పెక్ట్రమ్ కేటాయింపులలో అవకతవకలకు పాల్పడి కొన్ని కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించి రూ.1 76 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని కాగ్ నివేదిక ఇవ్వడంతో సిబిఐ కేసు నమోదు చేసింది.

2జీ స్కామ్

ఈ కేసుపై సిబిఐ, ఈడీ దర్యాప్తు జారీ ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, టెలికం కార్యదర్శి సిద్దార్థ,కొన్ని టెలికం సంస్థలకి, మరి కొంతమందికి ఈ స్కామ్ లో సంబంధం ఉన్నట్లు ఛార్జీషీట్ దాఖలు చేసారు, టెలికం మాజీ మంత్రి ఏ రాజాని సంవత్సరం పాటు జైలులో కూడా పెట్టారు, అనేక దర్యాప్తులు, విచారణల అనంతరం పాటియాలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. వీరితో పాటు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందునే వారిని నిర్దోషులుగా తేల్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో అప్పీల్‌ చేయనున్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

(Visited 119 times, 1 visits today)