Home / Videos / చిల్డ్రన్స్ డే రోజే ప్లే స్కూల్ లో విషాదం..! సంపూలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి..!

చిల్డ్రన్స్ డే రోజే ప్లే స్కూల్ లో విషాదం..! సంపూలో పడి మూడేళ్ళ చిన్నారి మృతి..!

Author:

బాలల దినోత్సవం రోజే మన హైదరాబాద్ లో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక మూడేళ్ళ బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది, ప్లే స్కూల్ అంటేనే కేవలం చిన్న పిల్లల కోసం మరి అలాంటి స్కూల్ యాజమాన్యం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాంటి ప్లే స్కూల్ లో సంపూలో పడి అభం శుభం ఎరుగని మూడేళ్ళ చిన్నారి చనిపోవడం చాలా ఘోరం..పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్లే స్కూల్ bachpan play school

సికింద్రాబాద్ మల్కాజిగిరి విష్ణుపురి కాలనీలో బచ్ పన్ ప్లే స్కూల్ ఉంది. ఆ ప్లే స్కూల్ లో నర్సరీ, పీపీ1, పీపీ2 నడుస్తున్నాయి. ఈ కేర్ సెంటర్ లో ఎన్.శివ రుచిత్ అనే మూడేళ్ల చిన్నారి చదువుతున్నాడు. నవంబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం తల్లిదండ్రులు శివ రుచిత్ ను స్కూల్ లో రోజులాగే వదిలి వెళ్లారు. స్కూల్ లోనే ఆడుకుంటూ వెళ్లి మూత తెరిచి ఉన్న సంపులో పడ్డాడు. ఈ విషయాన్ని చాలా సేపు స్కూల్ సిబ్బంది కూడా గమనించలేదు. సంపు క్లోజ్ చేద్దామని వెళ్లిన స్కూల్ సిబ్బందికి సంపులో రుచిత్ పడి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్కూల్ దగ్గరకి పోలీసులు వచ్చి, పేరంట్స్ ను పిలిచి.. స్కూల్ లోని మిగతా చిన్నారులను ఇంటికి పంపించి, స్కూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసారు, స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఒక చిన్న పిల్లాడు బలయ్యాడు అని, బచ్ పన్ స్కూల్ అంటేనే చిన్న పిల్లలు ఉండేది. అలాంటిది ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా అని పేరంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలని ప్లే స్కూల్ లలో, డే కేర్ సెంటర్ లలో వదిలేసే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా స్కూల్ ఆవరణని, సిబ్బందిని పరిశీలించి పిల్లలని జాయిన్ చేయాలనీ పోలీసులు కోరుతున్నారు,

(Visited 435 times, 1 visits today)