Home / Inspiring Stories / 7 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ లో తెరుచుకున్న గురుద్వారా!!

7 దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ లో తెరుచుకున్న గురుద్వారా!!

Author:
gurudwara in pakistan
పాకిస్థాన్‌లోని పేషావర్‌ సమీపంలో 300 సంవత్సరాల నాటి సిక్కుల పవిత్ర పార్థనా మందిరమైన గురుద్వారా 73 ఏళ్ళ తర్వాత తిరిగి తెరుచుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వ పటిష్ట భద్రత మధ్య సిక్కు మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. సిక్కుల అతి పురాతన మందిరాలలో ఒకటైన ఈ గురుద్వారా 1940లో మూతపడింది. 40, 50 వ దశకం లోని రాజకీయ కారణాల వలనా, దేశ విభజన మూళం గానూ ఆ రోజుల్లో ఇక్కడి సిక్కులు ఇండియాకి తరలిపోయారు. పాక్ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని అనేక రకాలుగా వినియోగించుకుంది. అయితే దీన్ని పున:ప్రారంభించాలంటూ పాక్‌లో మైనార్టీకి చెందిన సిక్కులు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతూనే ఉన్నారు . చివరకు 7 దశాబ్దాలకి వారి కల ఫలించింది.
Gurudwara opened in Pakistan
అంతా సమసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఇది ఇలా ఉండగా, స్థానిక ముస్లింలు కూడా గురుద్వారాపై దాడి అనివార్యమని భావిస్తున్నారు. తాజాగా ఓ సిక్కు మతానికి చెందిన సర్దార్ సురన్ సింగ్‌ను ఉగ్రవాదులు హత్య చేయడం కలకలం రేపుతోంది. ఏది ఏమైనా పాక్ లో ఓ సిక్కు ఆలయానికి అండగా నిలిచిన పాకిస్తానీయులు అభినందనీయులు కదా. భారత్, పాక్ స్నేహ సంభందాలకు ఓ అడుగు ముందుకేసినందుకు, భారత్ పాక్ భాయి భాయ్ అని ప్రపంచమంతా చెప్పుకునే రోజులని దగ్గరకి తెస్తున్నందుకు.
(Visited 1,140 times, 1 visits today)