పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఇవాళ(అక్టోబర్-31) కూడా కొనసాగింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో కొన్ని రోజులుగా ఆయిల్ ధరలు దిగొస్తున్నాయి.
హైదరాబాద్ లో పెట్రోల్ పై 22 పైసలు తగ్గి లీటరు పెట్రోల్ ధర రూ. 84.42గా ఉండగా, డీజిల్ పై 09పైసలు తగ్గి లీటరు డీజిల్ ధర రూ. 80.35గా ఉంది.
విజయవాడలో పెట్రోల్ ధర రూ.83.99, డీజిల్ ధర రూ.79.49గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 22పైసలు తగ్గి లీటర్ పెట్రోల్ ధర రూ.79.94కు చేరింది. డీజిల్ ధర 09 పైసలు తగ్గి రూ.73.94గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గి రూ.85.13కు, డీజిల్ 09పైసలు తగ్గి రూ.77.42కి చేరింది.
గమనిక : ఇవి BPCL వెబ్ సైట్ లో పేరొకొన వివరలు. సరఫరా కంపెనీలను, ప్రాంతాలను బట్టీ ధరల్లో కొద్దిగా తేడాలుంటాయి.