Home / Political / లింకులు క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని 7 లక్షల మంది మోసపోయారు.

లింకులు క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని 7 లక్షల మంది మోసపోయారు.

Author:

ఒక లింక్ మీదా క్లిక్ చేస్తే 5 రూపాయలు ఇస్తాం, మీరు ఇంకొకరిని ఈ స్కీం లో జాయిన్ చేయిస్తే వారి ఆదాయంలో మీకు వాటా ఇస్తాం అన్న కాంసెప్ట్ తో సోషల్ ట్రేడ్ అనే వెబ్ సైట్ 7 లక్షల మందిని మోసం చేసింది. మీరు కొంత డబ్బు కట్టి మా స్కీం లొ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తరువాత మీకు రోజు కొన్ని లింకులు పంపిస్తాం వాటి మీదా క్లిక్ చేస్తే చాలు మీకు డబ్బులే డబ్బులు అంతేకాకుండా మీరు కొత్తవారిని జాయిన్ చేస్తే వారి ఆదాయంలో కూడా మీకు వాటా ఇస్తాం అని ప్రచారం చేయడంతో చాలామంది సోషల్ ట్రేడ్ వారి వలలో పడ్డారు. ముందుగా కొన్ని రోజులు అందరికి అనుకున్నట్లుగానే డబ్బులు రావడంతో చాలామంది వేరేవారిని ఇందులో జాయిన్ చేసారు. ఇలా మొత్తం 7 లక్షల మంది నుండి 3700 కోట్ల డబ్బులు వసూలు చేసిన సోషల్ ట్రేడ్ చివరికి బోర్డు తిప్పేసింది.

3700 crore fraud

ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అబ్లేజ్ ఇన్ఫో సొల్యుషన్స్ అనే సంస్థ ఈ సోషన్ ట్రేడ్ స్కీం ని మొదలుపెట్టింది. స్కీం లోని సభ్యులకు పంపే అడ్వర్టైజ్ మెంట్ లింకుల మీదా క్లిక్ చేస్తే డబ్బులొస్తాయని ప్రచారం చేసింది కాకపోతే ఈ స్కీం లో జాయిన్ అవ్వాలంటే ముందుగా 50 వేల రూపాయలు కట్టాలి. మొదట్లో జాయిన్ అయిన వారికి నిజంగానే డబ్బులు వస్తుండడంతో ఆశకు గురైన చాలామంది 50,000 కట్టి ఈ స్కీం లో జాయిన్ అయ్యారు. చివరకు అలా ఆ స్కీం లో 7 లక్షల మంది సభ్యులయ్యారు గత కొన్ని రోజులుగా సభ్యులకు డబ్బులు రావడం ఆగిపోయింది ఏంటని ఆరా తీస్తే అసలు ఇదంతా మోసం అని అసలు అడ్వర్టైజ్ మెంట్ లింకుల మీదా క్లిక్ చేస్తే డబ్బులు రావడం లేదని కేవలం సభ్యులు కట్టిన డబ్బులనే మళ్ళి తిరిగి కొంత వారికి ఇస్తున్నారని తెలిసింది. చివరికి ఆ సంస్థ ఫౌండర్ అనుభవ్ మిట్టల్ ని పోలీసులు అరెస్ట్ చేసారు మరి ఇప్పుడు 7 లక్షల మంది కట్టిన డబ్బుల పరిస్తితి ఎమితో వారికే తెలియాలి.

(Visited 2,149 times, 1 visits today)