Home / Political / మార్చి 31 తర్వాత మీ దగ్గర పాతనోట్లు ఉంటే ఇక జైలుకే.

మార్చి 31 తర్వాత మీ దగ్గర పాతనోట్లు ఉంటే ఇక జైలుకే.

Author:

నల్లధనాన్ని, దొంగ నోట్లను అరికట్టడానికి పాత 500, 1000 నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. అప్పటినుండి చాలా సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని నిర్ణయాలు ప్రజల బాధలను తీర్చడానికి బదులు ఇంకా ఎక్కువ చేసాయి. ఇక పాత నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసుకోడానికి విధించిన గడువు ఈ నెల 31 తో ముగిసిపోతుండడంతో ఇప్పుడు కేంద్రం ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. మార్చి 31 తర్వాత ఎక్కువ మొత్తంలో పాత 500, 1000 రూపాయల నోట్లు కలిగి ఉన్న వారికి నాలుగేళ్ల వరకు జైలుశిక్ష అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

penalty-and-jail-for-having-old-notes

ఈ మేరకు సమవేశమైన కేంద్ర కెబినెట్ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంది.. దాని ప్రకారం మార్చి 31 తర్వాత పాత 500, 1000 రూపాయల నోట్లు ఉపయోగించేవారికి మరియు పెద్ద మొత్తంలో రద్దయిన నోట్లు కలిగి ఉన్నవారికి భారి జరిమానాలు లేదా నాలుగేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపి రాష్ట్రపతి కి పంపించారు. రాష్ట్రపతి ఆమోదిస్తే ఇక మార్చి 31 తర్వాత మీ దగ్గర పాతనోట్లు ఉండి సరైన అధారాలు లేకుంటే పైన జరిమానాలు, జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. అందుకే మీ పాత నోట్లను త్వరగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోండి.

(Visited 306 times, 1 visits today)