Home / Inspiring Stories / ఆ ఊరి నిండా ఐఏఎస్ లే ఉన్నారు.

ఆ ఊరి నిండా ఐఏఎస్ లే ఉన్నారు.

Author:

IAS village

మన ఊరి నుండి పది మంది టీచర్ లు అయితేనే చాలా గొప్పగా చెప్పుకుంటాం, నలుగురైదుగురు ఎస్.ఐ లు అయితే మనది చాల గొప్ప గ్రామంగా ఫీల్ అవుతం, ఒకవేళ ఊరి నిండా ఐఏఎస్ లు ఉంటే మన ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేం, మన మండలానికే ఒక ఐఏఎస్ కష్టం అలాంటిది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఒక  ఊరి నిండా ఐఏఎస్ లు ఉన్నారు, మన దేశంలో ఏ గ్రామానికి లేని ప్రత్యేకతని ఆ ఊరు సంపాదించుకుంది.

మధోపట్టి అనే ఊరు ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం,ఆ ఊర్లో ఉండేది 75 గడపలు మాత్రమే కాని ఆ గ్రామం మన దేశం యొక్క అబివృద్దిలో అన్ని గ్రామాల కంటే ఎక్కువగా పాలు పంచుకుంటుంది, ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని కుటుంబాల నుండి ఒక ఐఏఎస్ ఉన్నారు, ఆ గ్రామం నుండి ఇప్పటి వరకు 47 మంది ఐఏఎస్ లు వచ్చారు, ప్రతి కుటుంబం నుండి ఒక ఐఏఎస్ ఉన్నరంటే ఆ గ్రామం యొక్క టాలెంట్ ని ఆర్థం చేసుకోవచ్చు, బ్రిటిష్ వారి కాలం నుండి ఈ గ్రామ ప్రజలు సివిల్ సర్వీసెస్ లో రాణిస్తున్నారు,అందరి కంటే ముందు 1914లో బ్రిటిష్ వారి కాలంలో సివిల్ సర్వెంట్ గా పని చేసిన ముస్తఫా హుస్సేన్ ఆదర్శంతోనే సివిల్ సర్వీసెస్ లో చేరుతున్నట్టు ఆ గ్రామ ప్రజలు తెలిపారు.

IAS Village madhopatti

మన దగ్గరైతే ఐఏఎస్, ఐపిఎస్ కావడం ఒక కలగానే మిగిలిపోతుంది చాల మందికి, ఎన్నో సంవత్సరాలు కష్టపడి కోచింగ్ లు తీసుకొని అవుతారు , కానీ మదోపట్టి లో ఎటువంటి కోచింగ్ లు లేకుండా ఒకటి, రెండు ప్రయత్నలలోనే సివిల్ సర్వీసెస్ కి ఎంపిక అవుతున్నారు, ఒకే కుటుంబం నుండి నలుగురు అన్నదమ్ములు ఐఏఎస్ కి ఎంపిక అయ్యి ఒక కొత్త రికార్డుని నెలకొల్పరు. ఆ ఊరికి చెందిన కొంతమంది శాస్రవేత్తలుగా, మరి కొంతమంది భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కొన్ని సంస్థలలో ఉన్నత స్థానాలలో పనిచేస్తున్నారు.

(Visited 1,389 times, 1 visits today)