Home / Inspiring Stories / దేశం కోసం పోరాడిన చేతులతోనే నేడు బిచ్చం ఎత్తుకుంటున్న సైనికుడు..!

దేశం కోసం పోరాడిన చేతులతోనే నేడు బిచ్చం ఎత్తుకుంటున్న సైనికుడు..!

Author:

వందల సంవత్సరాల నుండి బ్రిటిష్ వారు చేసిన నియంతృత్వ పాలన నుండి స్వాతంత్రం సంపాదించి 70 సంవత్సరాలు అయింది, దేశనికి వచ్చిన స్వాతంత్య్రాన్ని గుర్తుంచుకొని సంబరాలు జరుపుకుంటున్నాం కానీ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వారిని ఎప్పుడో మరిచిపోయాం, ఏదో కొంతమందిని రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం వాడుకోవటం వల్ల కొంత మంది మనకి గుర్తున్నారు, మిగిలిన వారి గురుంచి ఇప్పుడే కాదు, స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి ఆలోచించ‌లేదు, మన రాజకీయ నాయకులకి ఎన్నికల సమయంలోనే అందరు గుర్తుకొస్తారు ఆ తరువాత మరిచిపోతారు, వారికి ప్రజా సమస్యల గురుంచే సరిగ్గా తెలియదు ఇక స్వాతంత్ర సమరయోధుల గురుంచి తెలుస్తుంది అనుకోవడం మన భ్రమే అవుతుంది. దేశం కోసం పోరాడి ఇప్పుడు ఎలాంటి దయనీయమైన పరిస్థితులలో జీవిస్తున్నారో తెలుసుకుంటే మనసు కలిచివేస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీ కి చెందిన శ్రీపత్ జీ అనే 90 ఏళ్ళ వృద్ధుడు భారత స్వాతంత్రోద్యమంలో నేతాజీ పిలుపు మేరకు తాను కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాల‌ని నిశ్చ‌యించుకుని నేతాజీ  ఏర్పాటు చేసిన ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీలో చేరాడు, దేశం కోసం బ్రిటిష్ సైన్యంతో ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడాడు, కానీ ఇప్పుడు అతనిని చుస్తే ఎవ‌రికైనా జాలి కలుగుతుంది, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన చేతులతోనే ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు, రోడ్ల‌పై, ఖాళీ ప్ర‌దేశాల్లో, పార్కుల్లో, బస్టాండ్ లలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ నిద్రిస్తున్నాడు. ఎండ‌కు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ, చ‌లికి వ‌ణుకుతూ ద‌య‌నీయమైన పరిస్థితికి అత‌ను చేరుకున్నాడు.

90-Aged-Freedom-Fighter-Found-Begging-In-Republic-Of-India

ఒకప్పుడు ఏంతో బాగా బతికిన శ్రీపత్ జీ కొడుకుకి ఉన్న వ్యసనాల కారణంగా ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, కొడుకు వ్యసనాల బారిన పడటంతో కుటుంబ భారం మొత్తం శ్రీపత్ జీ మీదనే పడింది, 90 ఏళ్ళ వయసులో ఏ పని చేయలేక, స్వాతంత్ర సమరయోధుల పింఛను కోసం అధికారులకి లంచం ఇచ్చుకోలేక బిచ్చం ఎత్తుకొని బతుకుతున్నాడు, ఇప్పటికికైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం అయిన కళ్ళు తెరిచి శ్రీపత్ జీ గారిని స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి ఆదుకోవాలని చాలామంది విజ్హ్ణప్తి చేస్తున్నారు.

90-Aged-Freedom-Fighter-Found-Begging-In-Republic-Of-India2

శ్రీపత్ జీ లాగానే చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు బతకడానికి కష్టపడుతున్నారు, వాళ్ళు ఏంతో కస్టపడి తెచ్చిన స్వాతంత్య్రాన్ని మనం ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు మాత్రం తిండి కోసం అల్లాడిపోతున్నారు, ఇలాంటి వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి ఆదుకోవాలి.

Must Read: ఇంత అవినీతా..? 50 లక్షల పనికి 58 కోట్లు ఖర్చు అవుతాయని లెక్క కట్టిన ప్రభుత్వం.

(Visited 3,129 times, 1 visits today)