పుస్తకాల బరువు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్ కు చెందిన 9 వ తరగతి విద్యార్థిని దాదాపు 10 కేజీల బరువున్న తన పుస్తకాల బ్యాగ్ ను మోసుకుంటూ మూడవ అంతస్తులో ఉన్న తన క్లాస్ రూమ్ కు చేరుకొని , ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన హాస్పిటల్ కు తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ! ఒక్కసారిగా బిపి డౌన్ అయ్యి, ఆమె మరణించిందని డాక్టర్లు నిర్థారించారు.! ఈ విషయంలో సదరు స్కూల్( కౌటిల్య స్కూల్ ) మీద కేసు నమోదైంది.
తప్పెవరిది?
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం పుస్తకాల బరువుకు సంబంధించిన కొన్ని నిబంధనలను పెట్టింది. ప్రభుత్వ పాఠశాల అయినా ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ఈ నిబంధనలు పాటించాల్సిందే.! కానీ ఇక్కడ జరిగిందేంటి? ఆ అమ్మాయి వీపు మీద ఉన్న ఆ పుస్తకాల బరువు దాదాపుగా 10 కేజీల పైనే ఉంటుంది? ఈ విషయంలో ఏవరిని నిందించాలి? ఎక్కువ పుస్తకాలుంటేనే ఎక్కువ చదువు వస్తుందనే భ్రమలో ఉన్న తల్లిదండ్రులనా? ప్రైవేట్ స్కూల్ లో 10 పుస్తకాలెక్కువుంటాయ్..అప్పుడే గవర్నమెంట్ కన్నా ఎక్కువగా చెబుతున్నాం అనే ఇంటెన్షన్ క్రియేట్ అవుతుందనుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానిదా? నిబంధనలు విధించిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించని విద్యాఅధికారులదా?
తప్పెవరిదైనా బలైనా ఆ నిండు ప్రాణాన్ని మాత్రం ఎవ్వరూ తీసుకురాలేరు.! ఇకనైనా తగు జాగ్రత్తలు తీసుకొని ..రేపటి బాలల భుజాలపై బుక్స్ పేరిట హమాలీ బరువులు మోయించకండి.!!
అసలు ఏ తరగతి ఎంత బరువున్న బుక్స్ ఉండాలి?( తెలంగాణ ప్రభుత్వ నిబంధనలను అనుసరించి)
Watch Video Here:
A 14-yr-old girl collapsed outside her classroom after climbing 3 floors with her heavy bag. Body sent for postmortem. #Warangal #Telangana pic.twitter.com/G1u7Ob8V7e
— Paul C Oommen (@Paul_Oommen) October 17, 2017