Home / General / మరణం లోనూ అసమానతలా?!

మరణం లోనూ అసమానతలా?!

Author:

ఇది ‘దీప్ తివానా’ అనే వ్యక్తి ఆవేదన. తనేమంటున్నాడో చూడండి….

ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది.ఎవరైనా ప్రముఖ వ్యక్తి మరణిస్తే మొత్తం ప్రపంచం ఆమె/ఆయనకు నివాళి అర్పిస్తుంది. అదే ఒక సైనికుడు మాతృభూమి రక్షణలో మరణిస్తే ప్రపంచం సంగతెలా ఉన్నా కనీసం సొంత దేశ పౌరులు కూడా పట్టించు కోరు. కేవలం వారి కుటుంబ సభ్యులో సంబంధించిన వారో తప్ప మరెవరికీ ఈ సంగతి పట్టదు. ప్రమఖులు తమ వారసులకు ఎంతో సంపదనూ సౌకర్యాలను విడిచి వెళ్తారు. ఏటేటా వారి ఙ్ఞాపకార్థం ఏదో ఒక అవార్డుల వేడుకనో లేక వారి సంస్మరణార్థం ప్రదర్శనలో ఏర్పాటు చేస్తారు.

మరో వైపు చూస్తే, సైనికుని మృతితో అతని కుటుంబం రోడ్డున పడుతుంది. అమర సైనికుని విధవ తన ప్రభుత్వ క్వార్టర్స్ ఖాళీ చేయాలి. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల కోసం కాళ్ళరిగేలా తిరగాలి.అతని పిల్లల చదువు కోసం ఇచ్చే రాయితీలూ తగ్గి పోతాయి.

తేడా చూడండి

ఇద్దరిదీ మరణమే కానీ ఒకరేమో సకల సదు పాయాలు కల విలాసవంతమైన హోటల్లోనో, హాస్పిటల్లోనో మరణిస్తే మరొకరు తూటాలకు బలవుతూ యుద్ధభూమిలో కన్ను మూస్తారు. ఇదంతా ఎందుకంటే ఇవ్వాళ నిద్ర మేల్కొనడం తోటే ప్రముఖ సీనియర్ నటి శ్రీదేవి మరణ వార్తపై అన్నిచోట్లా ఆమెకు నివాళులే!అందులో ఆక్షేపించ వలసిందేమీ లేదు కానీ ఇదే రోజు ఫ్లైట్ లెఫ్టినెంట్ వినీత్ భరద్వా 16వ వర్థంతి కూడా!

sridevi

ఆయన భార్య కూడా మా వాట్సప్ గ్రూపు సభ్యురాలే. అయినా ఆవిడ తన భర్త వర్థంతిపై ముఖపుస్తకం లో పోస్టు చేసేవవకూ ఎవరికీ గుర్తులేదు. ఇప్పటికీ ఆవిడ తన భర్త పోయిన దుఃఖాన్ని దిగమింగుతూ జీవన పోరాటం సాగిస్తున్నారు.

ఇవ్వాళ నేను మిమ్మల్ని కోరేదొకటే!
మనందరం మన మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వారికోసం కూడా ప్రార్థిద్దాం అని.
అదే మనం ఒక అమర వీరునికి ఇవ్వ గలిగిన ఘన నివాళి.
జైహింద్”.

india

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 26 times, 1 visits today)