Home / Inspiring Stories / అబ్బాయిలందరూ చెడ్డోళ్లు కాదు…అందరు తప్పక చూడాల్సిన వీడియో !

అబ్బాయిలందరూ చెడ్డోళ్లు కాదు…అందరు తప్పక చూడాల్సిన వీడియో !

Author:

ఈ బిజీ బిజీ లైఫ్‌లో యువతీయువకులు పొద్దున లేచిన దగ్గర్నుంచి కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. అబ్బాయిలంటే రన్నింగ్ బస్‌ను కూడా పరిగెత్తుకుంటూ ఎక్కగలరు. అమ్మాయిలు అలా కాదు కదా. చాలామంది అమ్మాయిలు ఒకచోటి నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి ఎక్కువగా ఆటోలను ఎంచుకుంటారు. అయితే ఆటోలో పక్కన కూర్చున్న మగవాళ్లు మంచోళ్లైతే ఏ ఇబ్బంది లేదు. అదే వంకర బుద్ధి కలిగిన వాడైతే. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ? అయితే అదే ఆటోలో ఉన్న మిగిలిన మగాళ్లు ఎలా స్పందిస్తారు. అలాంటి పరిస్థితే ఓ యువతి ఎదుర్కొంది. అయితే ఓపిక నశించిన ఆ యువతి తనను ఇబ్బంది పెడుతున్న వ్యక్తిని తిట్టింది. అయితే ఆమె తన మనోవేదనలో మగాళ్లందరినీ తప్పుబట్టింది. ఆ యువతికి ఆటోలో ఉన్న మిగిలిన మగాళ్లు చెప్పిన సమాధానం ఏంటి ? ఆకతాయిల వల్ల అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను… అబ్బాయిలపై కలుగుతున్న దురభిప్రాయాన్ని ఓ కల్పిత సన్నివేశంగా చిత్రీకరించి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ రెండు నిమిషాల వీడియోను మీరూ చూడండి.

Must Read: Video:షాపింగ్ మాల్స్ ట్రయల్ రూంలలో ఉండే సీక్రెట్ కెమరాలను ఈ విధంగా కనిపెట్టండి.

Source: Andhrajyothy.com

(Visited 7,545 times, 1 visits today)