రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్ దగ్గర ఓ ట్రక్కు బోల్తా పడింది. ఏం జరుగుతుందో ఊహించని టోల్‌ప్లాజా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. టోల్‌ప్లాజా దగ్గర బోల్తా పడిన ఆ ట్రక్కు, బీరు బాటిళ్ల లోడుతో అటుగా వెళ్తోంది. ట్రక్కు బోల్తా పడటంతో, బీరు సీసాలన్నీ నేలపాలయ్యాయి. బీరంతా వరదలా పారింది.
రాజస్తాన్‌లోని కిసాన్‌ఘడ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు.
#WATCH A truck rams into toll plaza in Rajasthan's Kishangarh; One person was injured in the incident (21.09.2018) (Source: CCTV footage) pic.twitter.com/GcG8v3dIly
— ANI (@ANI) September 22, 2018