నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? …జవాబు: పోలీసాఫీసర్, లాయర్, టీచర్…..సాకర్ ప్లేయర్, ఫైర్ ఫైటర్….పిజ్జా మేకర్.. ఎందుకు? సొసైటీ ని రక్షించటానికి…..మంచి ఇల్లు కట్టుకోవటానికి……ఇలా బోలెడన్ని ఆసక్తికరమైన జవాబులు చెప్పిన చిన్నారులను చూశారుగా….ఇంతకీ వాళ్ళకి ఇచ్చిన చివరి టాస్క్ ఏమిటంటే…తమ ఎదురుగా ఉన్న అమ్మాయిని చెంపదెబ్బ కొట్టమని..చూశారుగా ..వీడియో లింక్…..ఒక్కడంటే ఒక్క పిల్లాడు కూడా ఆ అమ్మాయిని కొట్టడానికి ఇష్ట పడలేదు..ఎందుకంటే…ఆడ పిల్లలను కొట్టడం మగతనం కాదనీ…ఆ అమ్మాయి చాలా క్యూట్ గా ఉందనీ….ఇలా మొత్తానికి తామంతా “ఆడపిల్ల ల మీద, మహిళల మీద జరుగుతున్న హింస కి వ్యతిరేకమ” నే మెసేజ్ ని చాలా బలంగా పంపారు ఆ చిన్న పిల్లలు…సభ్య సమాజానికి అర్ధమయ్యే రీతిలో పోస్ట్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నడుస్తోంది. ఇప్పటికీ 41 లక్షలమందికి పైగా ఈ వీడియో ని చూశారు. 17 లక్షలకు పైగా షేర్ చేశారు. కొత్త హీరోయిన్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ అందరి కీ భిన్నంగా సున్నితమైన మెసేజ్ తో కూడిన ఈ వీడియో ని తన ఫేస్ బుక్ పేజ్ మీద పోస్ట్ చేసింది.