Home / General / కేంద్రం సంచలన నిర్ణయం…! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా…జైలు శిక్ష! వివరాలు ఇవే!

కేంద్రం సంచలన నిర్ణయం…! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా…జైలు శిక్ష! వివరాలు ఇవే!

Author:

ఇప్పటి వరకు బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు కొనాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండేది. వీటితో పాటు రేషన్ కార్డుకు అయినా, పాస్‌పోర్టు పొందాలంటే కూడా ఆధార్ అడిగేవారు. అయితే ఇదివరకటిలా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు సంబంధించి మోడీ సర్కార్ టెలిగ్రాఫ్ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరిగ్ చట్టాలను సవరించేందుకు ఓకే చెప్పింది.

ప్లాస్టిక్ ఆధార్ తీసుకోవద్దు

ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థపై రూ. కోటి జరిమానా విధించాలని, అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చేపట్టిన చట్ట సవరణలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం పలికింది.

ఆధార్ కార్డుని డౌన్ లోడ్ చేయడం ఎలా..?

ఒక వేళ ఆధార్ తప్పని సరి చేయాలని భావిస్తే ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేస్తూ వెసులుబాటు కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అదికూడా సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది పార్లమెంటులో ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఒకవేళ పార్లమెంటు ఆమోదం తెలిపితే కొత్త సవరణలతో కూడిన చట్టం వెంటనే అమల్లోకి వస్తుంది.ఇకపై వినియోగదారుడి అనుమతి లేకుండా ఆధార్ ధ్రువీకరణ కోసం వివరాలు సేకరిస్తే రూ.10 వేలు జరిమానతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ఆఫ్‌లైన్ వెరిఫికేషన్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.

(Visited 1 times, 1 visits today)