ప్రతీ రెండేళ్ళకీ ఓక క్రిస్టమస్ వస్తోందంటే అమీర్ ఖాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తారు. తన సినిమాని క్రిస్టమస్ సీజన్ లో వదలటం అమీర్ ఖాన్ సెంటిమెంట్. ఐతే ఈ సారికూడా అమీర్ మరో కొత్త అవతారం తో వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఐతే ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇది వరకటి సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంది. బురదలోంచి బయటికి వస్తున్నట్టున్న అమీర్ మొహం విపరీతమైన్ కోపంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది.. మల్లయోధుడిగా వస్తున్న అమీర్ ఖాన్ మరోసారి నిజ జీవిత కథ ఆధారం గానే ఈ సినిమాని నిర్మిస్తున్నాడట ఈ బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్.
ప్రఖ్యాత రెజ్లర్ మహావీర్ పొఘట్ జీవిత కథ ఆధారం గా నిర్మిస్తున్న ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ తన బాడీని రెడీ చేసాడట. “ఆజ్ సే దంగల్ షురూ” (ఈ రోజు నుంచీ మల్లయుద్దం మొదలు) అనే టాగ్ లైన్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. రెజ్లింగ్ కోచ్ గా కనిపించనున్న అమీర్ ఖాన్ తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ లో ఈ సినిమా ఉండబోతోందంటున్నాడు.అమీర్ ఖాన్, ఆయన భార్య కిరన్ రావ్, సిద్దార్థ రాయ్ కపూర్ లు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా తన సెంటిమెంట్ ప్రకారం ఈ క్రిస్టమస్ కే రిలీజ్ చేయబోతున్నాడట అమీర్ ఖాన్. ట్రేడ్ గురు గా పిలుచుకునే తరుణ్ ఆదర్ష్ అద్బుతంగా ఉందంటూ కితాబివ్వటమే కాదు ఇంక్రీడిబుల్ అంటూ ట్విట్టెర్ లో పోస్ట్ చేసాడు. అమీర్ గత సినిమాలు “తారే జమీన్ పర్””త్రీ ఇడియట్స్” “పీకే” సినిమాలు క్రిస్టమస్ కే విడుదలై సూపర్ హిట్లు గా నిలిచిన సంగతి తెలిసిందే..