“కుందనబ్బొమ్మ..కుందనా బొమ్మా…” అని ఇంకా పాడుకుంటూనే ఉన్నాం. హస్కీ వాయిస్ తో తనదైన లుక్తో కుర్రాళ్ళ కలల్లో కొచ్చిన అందాల బొమ్మ సమంత ఇంకా కొందరికి జెస్సి గానే గుర్తుండి పోయింది. తన అందం తో దాన్ని మించిన నటనతో అందర్నీ అలరించి ఈ అందాల మళయాళీ భామ. మహేష్ లాంటి,అళ్ళు అర్జున్ లాంటి హేరోలతోనే కాదు పవన్ కళ్యాన్ లాంటి అగ్ర హీరోతోనూ నటించి మెప్పించింది. ఇండస్ట్రీ లో భారీ విజయాలనే తన ఖాతాలో వేసుకున్న సమంత ఇక నటించటం మానేస్తుందా!? తెరమీదినుంచి ఈ జెస్సీ వెళ్ళిపోతుందా!?
ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో సమంత ఇదే విశయాన్ని ప్రస్తావించారు. జనానికి తానొక గ్లామర్ డాల్ గా గుర్తుండి పోవటం ఇష్టం లేదనీ. హీరోయిన్ అంటే ఒక శృంగార వస్తువుగా చూపించే పాత్రలు ఇక ముందు చేయాలనుకోవటం లేదనీ, నటిగా తనకు సంతృప్తినిచ్చే పాత్ర ఉంటే అదెంత చిన్న సినిమా ఐనా తాను నటించటానికి సిద్దం అనీ చెప్పింది. ఒక వేళ సమంత ఇదే మాట మీద నిలబడితే. తమ సినిమాలో నటిస్తుందని ఎదురుచూసే నిర్మాతలూ, ప్రేక్షకులూ నిరాశతో కుంగిపోవటం ఖాయం.