Home / Inspiring Stories / అది వ్యక్తి గత వ్యవహారమెలా అవుతుందీ?

అది వ్యక్తి గత వ్యవహారమెలా అవుతుందీ?

Author:

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌ పై ఔట్‌లుక్ పత్రిక ప్రచురించిన కార్టూన్, కథనాలను ప్రైవేటు వ్యవహారంగా భావించడం లేదని ఉమ్మడి హైకోర్టు తెలిపింది. ఆమెను ఒక తల్లిగా, ఒకరి భార్యగా, ఒక కూతురుగా కథనంలో ప్రచురించినట్లు లేదని, ఒక ఐఏఎస్ అధికారి గానే కథనంలో పేర్కొన్నందున అది స్మితా సబర్వాల్‌ వ్యక్తి గత వ్యవహారం అని ఎంత మాత్రం అనలేం అనీ. ఇది ఆమే వ్యక్తిగత వ్యవహరం కాదని.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే, న్యాయమూర్తి ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. రెండు జిల్లాల్లో నిరంతర శ్రమ చేసి, ఎన్నో కొత్త కార్యక్రమాలకు కొత్తగా శ్రీకారం చుట్టి , పేదల పాలిట పక్షపాతిగా పెరు తెచ్చుకున్నా స్మితా సబర్వాల్‌ కలెక్టరుగా కరీంనగర్ లో పని చేస్తున్నప్పుడు రోడ్ల విస్తరణ, అక్రమణల తొలగింపు కోసం ఎంతగానో పాటు పడ్డారు. ఈ క్రమంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదు. కరీంనగర్ కలెక్టర్ గా వైద్య ఆరోగ్య శాఖలో ఆమె చేపట్టిన సంస్కరణలు అక్కడి ప్రజలకు వైద్య సదుపాయాలను దగ్గర చేశాయి. మెదక్ కలెక్టర్ గా ఎన్నికల సమయంలో ఓటింగ్ పెంచేందుకు ప్రజలకు బహుమతులు ఇస్తామని ప్రోత్సహించి మరీ ఆమె వారి సామాజిక బాధ్యతను, ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే స్మితా సబర్వాల్ ను కేసీఆర్ తన పేషీలోకి తీసుకున్నారు. అయితే ప్రముఖ మ్యాగజైన్ ‘ఔట్ లుక్’ మహిళలు తలదించుకునే విధంగా మాధవి తాతా అనే జర్నలిస్టు రాసిన ఈ కథనాన్ని అసభ్య కార్టూన్ తో ఔట్ లుక్ పత్రిక ప్రచురించింది.

ఈ నేపథ్యంలో కోర్టు ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం శ్రీమతి స్మితా సభర్వాల్ కి రూ.15 లక్షలు విడుదల చేసింది. అయితే స్మితా సబర్వాల్ వ్యవహారం వ్యక్తిగతం అని, దీని కోసం ప్రభుత్వం డబ్బులు కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ కే.ఈశ్వర్‌రావు అనే ఉద్యోగి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కోర్టులో ఈ కేసు గెలిస్తే స్మితా సభర్వాల్ ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారని, తిరిగి ఇవ్వాలని ఓడిపోతె ఇవ్వాలని అందులో లేదని వారు పేర్కొన్నారు.

ఐతే ఈ పిటిషన్‌ పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఒక ఐఏఎస్ అధికారిగా కథనంలో పేర్కొన్నందున అది స్మితా సబర్వాల్‌ కు మాత్రమే సంబంధించిన వ్యవహరం కాదని తేల్చి చెప్పింది. సున్నితమైన ఈ అంశంపై ఇన్‌కెమెరా (ఛాంబర్ లేదా గదిలో) ద్వారా విచారణ చేపట్టాలన్న అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డి అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి  ఛాంబర్‌ లోనే విచారించింది. ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైనందున రెండింటిని కలిపి సోమవారం  విచారించనున్నట్లు  ధర్మాసనం తెలిపింది. కాగా హైకోర్టు నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు.

(Visited 263 times, 1 visits today)