Home / Entertainment / మూవీ రివ్యూ: అదుగో

మూవీ రివ్యూ: అదుగో

Author:

డిఫరెంట్‌ జానర్‌ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవిబాబు మరో ఇంట్రస్టింగ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ పందిపిల్ల ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కించి అందరికి షాక్‌ ఇచ్చాడు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా పూర్తి లైవ్‌ 3డీ యానిమేషన్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. రాజమౌళి ఈగ లాగే.. రవిబాబు పంది కూడా ప్రేక్షకులను మెప్పించిందా..?

కథ:

బంటి (పందిపిల్ల‌) త‌న తండ్రి చెప్పిన మాట‌ల్ని పెడచెవిన పెట్టి ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లిపోతుంది. భూమి విష‌యంలో గొడ‌వ‌లున్న సిక్స్‌ప్యాక్ శ‌క్తి (రవిబాబు), దుర్గ అనే ఇద్ద‌రు ముఠాల చేతిలో చిక్కుకుంటుంది. భూమికి సంబంధించిన స‌మాచారం ఉన్న మైక్రోచిప్‌ని బంటి మింగ‌డంతో దానిని చేజిక్కించుకోవ‌డం కోసం ఆ రెండు ముఠాలు పోటీప‌డుతుంటాయి. ఇదే సమయంలో రాజీ (న‌భా), అభిషేక్ (అభిషేక్ వ‌ర్మ‌)అనే ప్రేమికుల చేతుల్లోకి బంటి వెళ్లుతుంది. దాంతో ఆ ప్రేమ‌జంట కూడా రెండు ముఠాల మ‌ధ్య ఇరుక్కుపోతుంది. ఇంత‌లో హైద‌రాబాద్ న‌గ‌రంలో పంది పిల్ల‌ల రేసింగ్ కోసం మ‌రో రెండు ముఠాలకి బంటి అవ‌స‌రం అవుతుంది. ఇంత మంది రౌడీలు కొన‌సాగించిన వేట మ‌ధ్య బంటి, ప్రేమ‌జంట ఎన్ని క‌ష్టాలు ప‌డింది? బ‌ంటి త‌ప్పించుకుని ఎలా మ‌ళ్లీ త‌న ఇంటికి వెళ్లిపోయింది? ప్రేమ‌జంట క‌థ సుఖాంత‌మైందా? లేదా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

అలజడి విశ్లేషణ:

అదుగో పూర్తిగా రవిబాబు మార్క్‌ సినిమా. టైటిల్స్‌ దగ్గరనుంచే రవిబాబు తనదైన క్రియేటివిటీతో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. మూడు వేరు వేరు కథలను ఓ పందిపిల్లకు ముడిపెడుతూ రవిబాబు తయారు చేసుకున్న కథ బాగుంది. కానీ కథనంలో ఏమాత్రం కొత్త దనం లేకపోవటం, రవిబాబు గత చిత్రాల ఛాయలు కనిపించటం కాస్త నిరాశకలిగిస్తుంది.లైవ్‌ 3డీ యానిమేషన్‌లో చూపించిన పందిపిల్ల క్యారెక్టర్‌ ఆకట్టుకున్నా.. సహజంగా అనిపించదు. తనకున్న బడ్జెట్‌ పరిమితుల్లో వీలైనంత క్వాలిటీ గ్రాఫిక్స్‌ ఇచ్చినప్పటికీ సగటు ప్రేక్షకుడికి కూడ పందిపిల్ల గ్రాఫిక్స్‌ అన్న విషయం అర్ధమైపోతుంది. ప్రశాంత్‌ విహారి అందించిన సంగీతం పరవాలేదనిపిస్తుంది. ప్రధానంగా కామెడీ నమ్ముకొని తెరకెక్కించిన ఈ సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పండినా… చాలా చోట్ల ఇబ్బంది కరంగా అనిపిస్తుంది.

adhugo-telugu-movie-review-and-rating

నటీనటుల

నటీనటుల విషయానికి వస్తే చంటి పాత్రలో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ సాత్విక్‌ వర్మ తప్ప మిగతా అన్ని క్యారెక్టర్లు కాస్త అతి చేసినట్టుగానే అనిపిస్తుంది. రవిబాబు గతచిత్రాల్లో కనిపించిన చాలా మంది నటులు ఈ సినిమాలోనూ రిపీట్‌ అయ్యారు. హీరో హీరోయిన్లుగా పరిచయం చేసిన అభిషేక్‌, నభాల పాత్రలు తెరమీద కనిపించేది కొద్ది సేపే. ఉన్నంతలో బాగానే పర్ఫామ్‌ చేశారు. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విజయ్‌ సాయి, అజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు..

ప్లస్ పాయింట్స్ :

  • బంటి విన్యాసాలు
  • సాంకేతిక‌త‌

మైనస్ పాయింట్స్ :

  • క‌థ
  • క్యారెక్టరైజేషన్స్‌
  • జుగుప్స క‌లిగించే స‌న్నివేశాలు

పంచ్ లైన్:  ‘అదుగో’ వెనక్కి చూడకుండా పారిపో!

రేటింగ్ :  1.5/5

గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

‘అదుగో’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి  ?

(Visited 1 times, 1 visits today)