Home / health / హాస్పిటల్ లో కల్తీ రక్తం కలకలం.

హాస్పిటల్ లో కల్తీ రక్తం కలకలం.

Author:

పాలు, తినే వస్తువులే కాదు… ఆఖరికి రక్తాన్ని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్ళు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానా ఈ నకిలీ బ్లడ్ కు అడ్డాగా మారింది. హాస్పిటల్ లో పనిచేసే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని కల్తీ చేస్తూ పేషంట్లకు అమ్ముతున్నట్లు గుర్తించారు.

కల్తీ రక్తం Adulterated Blood in Hyderabad

హైదరాబాద్ సుల్తాన్ బజార్ మెటర్నిటీ హస్పిటల్ లో కల్తీ రక్తం బయటపడింది. ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న దందాను బయటపెట్టారు అధికారులు. ఆస్పత్రికి వచ్చే పేదరోగులకు అందులో పనిచేసే వ్యక్తే.. కల్తీ బ్లడ్ అమ్ముతున్నట్లు నిర్ధారించారు. రక్తంలో సెలైన్, కెమికల్స్ కలిపి తయారు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు.

కల్తీ బ్లడ్ అమ్ముతున్న నరేంద్రకుమార్ కు ఆస్పత్రిలో కొందరు సిబ్బంది సపోర్ట్ ఉందని కూడా అధికారుల ఎంక్వైరీలో తేలింది. అయితే ఇంతకాలం బ్లడ్ ఇస్తున్నా… ఎవరూ గమనించకపోవడానికి ఓ అధికారి సహకరించినట్టు తేలింది. ఆస్పత్రిలో పనిచేసే వ్యక్తితో ఇటీవల నరేంద్రకుమార్ ఘర్షణ పడటంతో ఈ విషయం బయటికి వచ్చినట్లు చెప్పారు. సిటీలోని కొన్ని బ్లడ్ బ్యాంకుల పేరుతో స్టిక్కర్స్ ,లేబుల్స్ అంటించిన విషయం, ఆయా బ్లడ్ బ్యాంకు నిర్వాహకుల కంప్లెంట్ తో గుట్టు రట్టయింది.

ఆస్పత్రిలో ఇన్ని రోజులుగా కల్తీ బ్లడ్ సేల్ చేయడంపై ఆస్పత్రి సూపరెంటెండ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రస్తుతం నరేంద్ర కుమార్ ను విధుల నుంచి తప్పించి… కేసు పెట్టినట్టు చెప్పారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనేది ఎంక్వైరీలో తేలుతుందన్నారు. సంచలనం కల్గించిన బ్లడ్ కల్తీ అంశంపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిచాల్సి ఉంది. ఇంతకాలం చడీచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారానికి కారకులైన వారిపై కఠినంగా వ్యవహరించాలని రోగులు కోరుతున్నారు.

Must Read: నొప్పికి పెయిన్ కిల్లర్ కాంబిఫ్లేమ్ టాబ్లెట్ వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!‪

(Visited 878 times, 1 visits today)