Home / Devotional / మన పెద్దవాళ్ళు ఎం చెప్పినా, చేసినా అందులో భక్తితో పాటు మనకు ఉపయోగపడే సైన్స్ కూడా ఉంటుంది. అలాంటి ఈ విషయం కూడా తెలుసుకోండి.

మన పెద్దవాళ్ళు ఎం చెప్పినా, చేసినా అందులో భక్తితో పాటు మనకు ఉపయోగపడే సైన్స్ కూడా ఉంటుంది. అలాంటి ఈ విషయం కూడా తెలుసుకోండి.

Author:

రానున్న తొమ్మది రోజులు హిందువులు చాలా మంది పవిత్రంగా ఉంటారు దానికి కారణం గణపతి దేవుణ్ణి ప్రతిష్టించారు కాబట్టి. ఈ తొమ్మిది రోజులు చాలా నియమనిష్టలతో పూజలు చేస్తారు. కానీ మధ్యలో ఏ రోజైన గుడ్డు కానీ మాంసం కానీ తీసుకుంటే గణపతి మండపం దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు మరి ఆ విధంగా ఎందుకు అంటారో తెలుసా !

గుడ్డు, మాంసం రజో గుణ, తమో గుణ సంబంధమైన పదార్థాలు. ఇవి మనిషి తినడం వలన తన ఆలోచన శక్తిని కోల్పోయి కామ వికార కోరికలు ఎక్కువగా కలుగుతాయట! దాని వలన మనిషి మంచి ఆలోచనల బదులు చెడు ఆలోచనలు రావడం జరుగుతుంది..

After-eating-non-veg-why-should-people-wont-enter-into-temples

మానవుడు ఎప్పుడైనా తన మనశాంతి కొరకు దేవాలయం దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్తాడు. చాలా మంది ఉదయానే  స్నానం చేసి చాలా వరకు ఎలాంటి పదర్థాలు తినకుండానే దేవాలయాలకు వెలుతుంటారు. దానితో దేవాలయంలో మంచి ప్రశాంతత లభిస్తుంది.

గుడ్డు, మాంసం తిని గుడికి వెళ్లడం వలన మన మనసు ప్రశాంతగా ఉండక దేవుడి పై భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉండదు. దానితో కోరికలు అనేవి తీరవు అంటారు.   ఈ ప్రపంచంలో మన మనసు ప్రశాంతగా ఉన్నప్పుడు ఏదైనా కోరికలు కోరుకుంటే దానికి పకృతి కూడా తోడై మన కోరికలు  తీరుస్తుంది అంటారు.  మనకు మంచి మనశాంతి దేవాలయంలో దొరుకుతుంది కాబట్టి మనం అక్కడికి గుడ్డు, మాంసం లాంటివి తిని వెళ్ళకూడదు అంటారు.

(Visited 1 times, 1 visits today)