Home / Inspiring Stories / రిలయన్స్‌ దెబ్బకి రూ.51 కే 1జీబీ 4జీ డేటా ఇస్తానంటున్న ఎయిర్‌టెల్‌.

రిలయన్స్‌ దెబ్బకి రూ.51 కే 1జీబీ 4జీ డేటా ఇస్తానంటున్న ఎయిర్‌టెల్‌.

Author:

రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌ ప్రారంభ ఆఫర్లు మిగతా నెట్‌వర్క్‌ లకు గట్టిగానే తాకినట్లున్నాయి. ఇన్నాల్లు డేటా ప్యాక్ ల రేట్లు ఇష్టం ఉన్నట్లు పెంచుకుంటు పోయిన ఇతర నెట్‌వర్క్‌ లు జియో కి పోటీగా నిలవడం కోసం కొత్త్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ముందుగా భారతీ ఎయిర్‌టెల్‌ 4జీ, 3జీ మొబైల్‌ ఇంటర్నెట్‌ ధరలను తగ్గిస్తు కొత్త స్కీం తీసుకోచ్చింది . ఈ కొత్త స్కీం ప్రకారం ముందుగా ప్రతి ప్రీపెయిడ్ వినియోగదారుడు రూ.1498తో రీఛార్జ్‌ చేయించుకోవాలి. ఆ తర్వాత ఒక సంవత్సరం పాటు ఎన్ని సార్లు రూ.51తో రీఛార్జ్‌ చేస్తే అన్ని సార్లు 28 రోజుల వాలిడిటీతో 1జీబీ 3జీ/4జీ డేటా వాడుకోవచ్చు.

airtel-offers-1gb-4G-data-for-inr51

ఒకేసారి అంతమొత్తం కట్టలేని వారి కోసం రూ.748తో ఆరు నెలల స్కీం అందుబాటులో ఉంటుంది. కాని ఈ ఆరు నెలలలో 1జీబీ 3జీ/4జీ డేటా కోసం రూ.99తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాన్లు ఈ వారంతంలోపు అందుబాటులోకి వస్తాయి. ఇంతకు ముందే ఒకసారి జియో కి పోటీగా ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ లు డేటా ప్లాన్స్‌లోని డేటాను పెంచాయి. కాని జియో ఆఫర్లు మరింత ఆకర్షనీయంగా ఉండడంతో మరోసారి ఎయిర్‌టెల్‌ జియో కి పోటీగా కొత్త ఆఫర్లు ప్రకటించింది.

(Visited 1,862 times, 1 visits today)