Home / Technology / ఎయిర్ టెల్ లో సంవత్సరం పాటు డేటా, కాల్స్ అన్ని ఉచితమే…!

ఎయిర్ టెల్ లో సంవత్సరం పాటు డేటా, కాల్స్ అన్ని ఉచితమే…!

Author:

రిలయన్స్ జియో దెబ్బ నుండి మిగతా నెట్ వర్క్ కంపెనీలు ఇంకా తేరుకోలేదు, వారానికో కొత్త ఆఫర్ ని తీసుకొస్తున్న జియోతో పోటీపడలేక పోతున్నాయి, జియో ఆఫర్ తో ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఎక్కువగా నష్టపోయింది, 3G , 4G డేటా ని అన్ని నెట్ వర్క్స్ కంటే ఎక్కువ ధరకి అందించే ఎయిర్ టెల్ ఎన్ని ఆఫర్స్ ని ప్రకటించిన కూడా జియో ఎఫెక్ట్ ని తట్టుకోలేకపోయింది, మారుమూల గ్రామాల్లో కూడా జియో నెట్ వర్క్ ఫుల్ స్పీడ్ తో పని చేస్తుండటంతో అందరు జియో నెట్ వర్క్ కే కనెక్ట్ అవుతున్నారు.

airtel-free-for-one-year

ఇన్ని రోజులకి ఎయిర్ టెల్ ఒక బంపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది, 2017 వ సంవత్సరం డిసెంబర్ చివరి వరకు వర్తించేలా ఒక ఆఫర్ ని మంగళవారం నాడు ప్రకటించింది, 4జీ హ్యాండ్‌సెట్స్ ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని.. జనవరి 4, 2017 నుంచి ఫిబ్రవరి 28, 2017 మధ్య ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రకారం ” 4G మొబైల్ ఫోన్ కలిగిన ఎయిర్ టెల్ 4G నెట్ వర్క్ కి మారాలి, ఇప్పటికే ఎయిర్ టెల్ 3G సిమ్ వాడుతున్న వారు ఎయిర్ టెల్ 4G నెట్ వర్క్ అప్ డేట్ అవ్వాలి, ఈ ఆఫర్‌ కింద ప్రతి నెలా 3జీబీ డేటాను ఫ్రీగా పొందవచ్చని తెలిపింది. డిసెంబర్‌ 31, 2017 వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ ప్యాక్‌ల ద్వారా పొందవచ్చని తెలిపింది.

ప్రీపెయిడ్‌:ప్రీపెయిడ్‌ వినియోగదారులు రూ.345తో రీఛార్జ్‌ చేసుకుంటే ఈ పథకం కిందకు వస్తారు. రూ.345 రీఛార్జ్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ 4జీబీ(1జీబీ రెగ్యులర్‌ ప్యాక్‌ బెనిఫిట్‌ ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా)ను ప్రతినెలా పొందవచ్చు. ఇది 28రోజుల పాటు ఉంటుంది. డిసెంబర్‌ 31 వరకు కేవలం 13 సార్లు మాత్రమే రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

పోస్ట్ పెయిడ్:పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులు రూ.549 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 6జీబీ(3జీబీ రెగ్యులర్‌ డేటా ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా) డేటాను పొందవచ్చు. రూ.799 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 8జీబీ డేటా(5జీబీ రెగ్యులర్‌ డేటా ప్లస్‌ 3జీబీ ఉచిత డేటా) ను పొందవచ్చు.

(Visited 7,215 times, 1 visits today)