Home / Entertainment / అఖిల్ ఎందుకు భయపడుతున్నాడు!?

అఖిల్ ఎందుకు భయపడుతున్నాడు!?

Author:

మొదటి సినిమా నే బ్లాక్ బస్టర్ హిట్ ఐపోయింది అన్నంత కాన్ఫిడెన్స్ తో వస్తున్న సినిమా అఖిల్. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న రెండో వారసుడి మొదటి సినిమా ఇది. ఇప్పుడు ‘అఖిల్’ అన్ని విధాలా క్రేజీ సినిమాగా నిలవడంతో ఈ సినిమా విషయంలో ప్రతిదీ గ్రాండ్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనీ, ఇప్పటికి ఏర్పడిన క్రేజ్ ని ఏ మాత్రం తగ్గించాలనుకోవటం లేదట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకూ పలు అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. ఆస్ట్రియా, స్పెయిన్‌లోని పలు అందమైన లొకేషన్స్‌లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిగింది. ఆస్ట్రేలియాలో కూడా స్టెప్పులేసిన అఖిల్ తన సినిమా పాటలు ఈ నెల (సెప్టెంబర్) 20 న విడుదల చేయనున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియ జేసాడు. తమన్ ,అనూప్ రూబెన్స్ కలిసి సమ కూర్చిన సంగీతం అభిమానులని కట్టి పడేసే లానే ఉందట. సెప్టెంబర్ 20 న రెలీజయ్యే అఖిల్ ని వినటానికి అంతా ఆసక్తి గానే ఎదురు చూస్తున్నారు.   ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఒక అపూర్వ శక్తులున్న బంతి చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా కొంత హింట్ ఇచ్చేసారు కూడా.అక్టోబర్లో సినిమా రిలీజ్ అవబోతోంది.

దసరా రేసు లో నిల్బడటానికి విడుదల కాబోతున్న ‘అఖిల్’ సినిమాకు కొత్త ఆటంకం ఎదురయింది. తెలుగు సినిమాలోనే కాదు అసలు సినిమా ప్రపంచం లోనే “సెంటిమెంట్” అనే పదానికున్న పవర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అఖిల్ ని పట్టుకున్న భయం ఏమిటంటే.. ఇంత వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరో పేరు తోనే వచ్చిన ఏ సినిమా హిట్ అవలేదట. గతంలో హీరోల పేరును సినిమా టైటిల్ గా పెట్టి విడుదల అయిన సినిమాలు చాలా మటుకు ఘోరమైన ఫ్లాప్ లే. ఇంత వరకు టాలీవుడ్ లో హీరోల పేర్లను టైటిల్ గా మార్చిన సినిమాలు ఆ హీరోలకు హిట్ ఇచ్చిన సందర్భాలు పెద్దగా లేవు అన్న మాట ఎవరో అఖిల్ చెవిలో వేశారట .దానికి ఉదాహరణగా నాగార్జున కెరియర్ తొలి రోజులలో వచ్చిన ‘కెప్టెన్ నాగార్జున’ మంచు విష్ణు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా ‘విష్ణు’ అదేవిధంగా హీరోగా నటించిన ‘బ్రహ్మానందం డ్రామా కంపెనీ’ సినిమాలతో పాటు మెగా స్టార్ “జై చిరంజీవ” సినిమాలను ఉదాహరణగా చూపెడుతున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు నాగార్జున కెరియర్లలో తమ పేరుతో వచ్చిన సినిమాలు వారికి పీడకలలా మారడమే కాకుండా తీవ్ర అవమానాన్ని తెచ్చి పెట్టాయి.

ఇపుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న నాగార్జున తనయుడు అఖిల్ తొలి సినిమాకు అతడి పేరునే ‘అఖిల్’ అని టైటిల్ గా పెట్టి విడుదల చేస్తూ ఉండటం.. అదేకాక ఇప్పటికే “అఖిల్ తో సమానమైన ఎక్స్పెక్టేషన్ లతో వస్తున్న వరుణ్ తేజ్ “కంచే చరణ్ సినిమా, ‘బ్రూస్ లీ’ తో దసరా రేసుకు పోటీగా రావడం ఈ సెంటిమెంట్ రీత్యా సాహసం చేస్తున్నారు అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లను టెన్షన్ పెడుతున్నట్లు టాక్. అపూర్వ శక్తులున్న బాల్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందట. మరి ఆ బాల్ ప్రభావం అఖిల్ ని కాపాడుతుందా…లేక……!! అన్నది చూడాల్సిందే

(Visited 55 times, 1 visits today)