పాపం తమిళ్ హీరో విశాల్ కి ఈ మధ్య హిట్స్ లేక ఇక ఎం చేయాలో తోచని టైంలో తన పాత హిట్ పందెంకోడి గుర్తొచ్చింది.దానికి సీక్వెల్ తీస్తే తప్ప తనకు హిట్ రాదన్న విషయమూ అర్ధమైంది. ఇక అనకున్నదే తడువుగా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేసారట.అయితే పాత డైరెక్టర్ లింగు సామినే దీన్ని డైరెక్ట్ చెయమన్నరంట. అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది అన్న దగ్గరే వచ్చింది చిక్కంతా. అప్పుడు వీళ్ళ కన్ను కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర మీద పడింది. వెంటనే అప్రోచ్ కూడా అయ్యారు కానీ అమ్మడే ఏ విషయం ఇంకా చెప్పలేదంట. ఈ గ్యాప్ లో పనిలో పనిగా షామిలిని కూడా కలిసి ఓకే చేస్కున్నారని రూమర్స్. షామిలి అంటే ఎవరో కాదు మన బేబీ షామిలి. అయితే ఈ విషయం తెలిస్తే ఎక్కడ అక్షర నో అంటుందో అని వెంటనే కాదు షామిలి కాదు అని న్యూస్ ఫీలర్స్ ఒధిలెసారు.అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు అక్షర నో అంటే షామిలి కూడా నో అనేస్తే దిక్కెవరని లింగు సామి విశాల్ తలలు పట్టుకు కూచున్నారట. అక్షర కోసం షామిలి ని కాదన్నారు. ఈ కోపం తో షామిలి నో అనేస్తే ? పాపం పందెం కొడి 2 లో విశాల పక్కన జోడి ఎవరుతారో మరి ?