Home / Political / ఓటు వేసాక సెల్ఫీ దిగాలనుకుంటున్నారా.? అయితే అలా అస్సలు చేయకండి! ఎందుకంటే.?

ఓటు వేసాక సెల్ఫీ దిగాలనుకుంటున్నారా.? అయితే అలా అస్సలు చేయకండి! ఎందుకంటే.?

Author:

సెల్ఫీ..ఒకప్పటిలా ఫోటో దిగాలంటే హడావిడి అక్కర్లేదు ,చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..అందరూ ఫొటో గ్రాఫర్ లే అయిపోతున్నారు..టకటక ఫోటోస్ దిగిపోతున్నారు..అదే సెల్ఫీ.తమ చుట్టు ఉన్న పరిస్థితులను కూడా పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతూ ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ నడుస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

అయితే వోట్ వేయగానే ఎన్నికల సిరాను మన వేలిపై వేస్తారు. ఇక ఆ వేలు చూపిస్తూ ఎంతో మంది సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఇకపై అలా చేస్తే ఓటు చెల్లదంట.? మీరు విన్నది నిజమే…వివరాలు మీరే చూడండి!

ఎన్నికల బూతు లో ఫోన్ లు అనుమతించబడవు, ఒకవేళ మీరు ఫోన్ తీసుకొని వెళ్లి ఓటు వేసాక ఎన్నికల బూతులో సెల్ఫీ దిగితే, మీ ఓటు ని రద్దు చేస్తారు, మీరు ఓటువేస్తూ సెల్ఫీ దిగితే ఆ ఓటును 17 ఏలో నమోదు చేస్తారు. ఎప్పుడైతే ఆ ఓటును 17-ఏలో నమోదు చేశారో అది కౌంటింగ్ సమయంలో పరిగణలోకి తీసుకోరు. ఇక మీరు ఓటు వేసిన వేస్ట్ అన్నట్టే లెక్క.

అలాగని ఓటు వేసాము అని అందరికి చూపించడానికి సెల్ఫీ దిగే వీలు లేదు అనుకోకండి. కేవలం పోలింగ్ బూత్ లో మాత్రమే అలా సెల్ఫీ దిగొద్దు. కావాలంటే ఎన్నికల కేంద్రం కి కొద్దిగా దూరం వెళ్లి ఫోటోలు దిగొచ్చు. ఎన్నికల కేంద్రం లో మీరు ఓటు ఎవరికి వేస్తున్నారో, లేక వేరే వాళ్ళని వీరికి ఓటు వేయండి అని చెప్పినచో మీ ఓటు చెల్లదు, అది నేరం కిందకు వస్తుంది. కాబట్టి వెళ్ళామా…ఓటు వేశామ…సైలెంట్ గా వచ్చేశామ అనే టైపు లో ఉంటె బెటర్.

(Visited 1 times, 1 visits today)