నయన తార అంటేనే సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా చూస్తుంది. కెరీర్ ప్రారంభం లోనే తమిళ ఇండస్ట్రీ లో రజినీ కాంత్, సూర్య వంటి అగ్ర నటుల సరసన చాన్సు లు కొట్టేసిన ఈ అమ్మడు అప్పట్లో ‘చంద్రముఖి’ సినిమాలో రజినీ సరసన నటించడం..ఆ తర్వాత సూర్య ‘గజిని’ లో చాన్సు రావడంతో ఈ అమ్మడికి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకొంది. ఇక ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ. ఎప్పుడూ అటు సినిమా ఇందస్ట్రీ లోనూ, ఇటు మీడియాలోనూ వార్తల్లో ఉంటూ హల్ చల్ చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న మళ్ళీ పాత లవర్ శింబు తో గొడవతో వార్తల్లో నిలిచింది నయనతార.
గతంలోతమిళ యువ హీరో హీరో శింబుతో ప్రేమా, బహిరంగ రోమాన్స్ లతో బాగానే అందరి నోళ్ళలో నానింది. ఇక వీరి లిప్ లాక్ సీన్లు సోషల్ మీడియాలో దుమ్ము రేపాయి. తర్వాత కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ఎఫైర్ పెట్టుకుంది. వీళ్ళిద్దరూ పెళ్ళాడ బోతున్నారంటూ వార్తలొచ్చాయ్. ప్రభు దేవా తన భార్యకి విడాకులిచ్చాడు కూడా. ఒకదశలో ఐతే నయన తారే ప్రభుదేవాతో ఆయన భార్యకు విడాకులు ఇప్పించిందని, తమ పెళ్ళికి అడ్డు లేకుండా చేసుకోవటానికే వాళ్ళిద్దరి మధ్యా చిచ్చుపెట్టిందనే వార్తలు అప్పట్లో షికార్లు చేశాయి. మళ్ళీ ఏమైందో గానీ కొంత కాలం తర్వాత ప్రభు దేవాతో నయన్ ఎఫైర్ బెడిసి కొట్టింది. కొన్నాళ్ళ తరువాత తాను సినిమాల నుంచి తప్పుకుంటోంది అనే వార్తలు వచ్చాయ్ శ్రీ రామ రాజ్యం తర్వాత ఇక నయన్ నటించదట అనీ అనుకున్నారు. కానీ తొందర్లోనే మళ్ళీ ఫాం లోకి వచ్చిన ఈ అమ్మడి లిస్టులో హీరో ఆర్య పేరు కూడా వచ్చింది కానీ అంది అంతగా బయటకు రాలేదు.
తాజాగా డైరెక్టర్ విఘ్నేశ్ తో నయన నయా లవ్ స్టోరీ నడుపుతోందని, అతనితోనే మూడు ముళ్లు వేయించుకునేందుకు కూడా రెడీ అయినట్లు టాక్. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి సరసన ఓ మూవీలో నటిస్తోంది నయన్. ఈ సినిమాను రజినీ కాంత్ అల్లుడు హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ఐతే నయన విగ్నేష్ ల మధ్య ప్రేమ ముదిరి మరీ పాకాన పడటం తో నయన ఈ మద్య సినిమాలపై శ్రద్ధ తగ్గించిందట. తాజాగా నయన్ విగ్నేష్ ల ప్రేమ చేష్టలు చూసి హీరో ధనుష్ కు పిచ్చికోపం వచ్చిందట. అయితే విఘ్నేశ్, నయన షూటింగ్ ను పక్కన పెట్టి. షికార్లు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న ధనుష్ వీరిద్దరి పట్ల చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఏవైనా ప్రేమ
వ్యవహారాలు ఉంటే బయట చేసుకోండి ఎంతో పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే సమయంలో సమయాన్ని వృధా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ నయనతారకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.