Home / Entertainment / చిరు 150వ సినిమాలో నటించనున్న అందరు మెగా హీరోలు?

చిరు 150వ సినిమాలో నటించనున్న అందరు మెగా హీరోలు?

Author:

ఎట్టకేలకు మెగా అభిమానులు కలలు కన్న రోజు రానే వచ్చింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్  హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా మంచి జోరుతో సాగుతుంది. ఎవరేం అనుకున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సినిమా లో ఏమీ ఉండబోతున్నాయో చిరంజీవి స్వయంగా ఇటీవల జరిగిన మా టీవీ సినీ అవార్డ్స్ ఫంక్షన్ లో స్కిట్ వేసి చూపించారు. చిరంజీవి చుట్టూ అంత మంది తమ్ముళ్ళు ఉండడం మరియు అందరూ కలిసి డాన్స్ చేయడం వలన కూడా ఆ స్కిట్ చాలా బాగా వచ్చింది. ఈ నేపధ్యంలోనే చిరంజీవి 150వ సినిమాలో అందరూ మెగా హీరోలు నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందని సమాచారం.

All mega heroes to act in chiru 150th movie

ఈ మధ్య తెలుగు సినిమా లెక్కలు మారిపోయాయి. ఒక్కొక్క హీరొ మంచి కథతో 50 కోట్ల కలెక్షన్స్ ఈజిగా సాధిస్తున్నారు. బహుబలి సినిమా ఐతే భారీ కలెక్షన్స్ సాధించి ఎవరికి అందనంత ఎత్తులో ఉంది. ఈ పోటీలోకి మెగాస్టార్ 150వ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాడు.  అందుకే ఈ సినిమాతోనే బాక్స్ ఆఫీస్ మీదా చిరంజీవి మార్కును చూపించాలని రామ్ చరన్ తేజ్ ప్లాన్స్ వేస్తున్నాడు. అందులో భాగంగానే మెగాహీరోలందరిని ఒక్క తాటిపైకి చెప్పి ఈ సినిమాలో నటింపజేయాలనుకుంటున్నారు. చిన్న పాత్రలు చిన్న పాత్రలు వేయించటం కుదరకుంటే పాటలో డాన్స్ వేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇది గనక సాధ్యపడితే మెగాస్టార్ 150 వ సినిమా భారీ వసూళ్లు చేయడం ఖాయం.

(Visited 633 times, 1 visits today)