Home / Videos / Video: సుకుమార్ ప్రాణాలని కాపాడిన అల్లు అర్జున్.

Video: సుకుమార్ ప్రాణాలని కాపాడిన అల్లు అర్జున్.

Author:

అల్లు అర్జున్ , దిల్ రాజు, సుకుమార్ ఈ ముగ్గురు కలిసి తమ కెరీర్ మొదట్లో తీసిన సినిమా ఆర్య, ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి సరికొత్త కథనంతో సూపర్ హిట్ గా సినిమాగా ఆర్య సినిమా నిలిచింది, ఈ సినిమా హిట్ తరువాతనే ఈ ముగ్గురు పెద్ద స్థాయిలోకి వెళ్లారు, ఆర్య సినిమా షూటింగ్ అప్పుడు జరిగిన ఒక సంఘటనని సుకుమార్ ‘ దర్శకుడు ‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు.

ఆర్య షూటింగ్ సమయంలో బోట్ లో వెళ్తున్నప్పుడు హీరోయిన్ గెంతటం వల్ల బోట్ తిరగపడి సుకుమార్ నీళ్ళల్లో పడిపోయాడు, సుకుమార్ కి ఈత రాకపోవటంతో నీళ్ళల్లో మునుగుతూ ఇవే చివరి క్షణాలు అనుకుంటున్నప్పుడు , యూనిట్ సభ్యులు షాక్ కి గురై అలాగే చూస్తున్నప్పుడు, అల్లు అర్జున్ ప్రాణాలకి తెగించి నీళ్ళలోకి దూకి సుకుమార్ ని కాపాడాడు అని అల్లు అర్జున్ తన రియల్ లైఫ్ హీరో అని సుకుమార్ తెలిపాడు.

(Visited 250 times, 1 visits today)