రవితేజ సినిమా అనగానే మొదట గుర్తుకొచ్చేది హాస్యమే. దర్శకుడు శ్రీనువైట్లదీ అదే పంథానే. మాస్ అంశాలు ఎన్ని ఉన్నా నవ్వించడం మాత్రం మరిచిపోరు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన దుబాయ్ శీను, వెంకీ చిత్రాలు మంచి వినోదాన్ని పండించాయి. విజయవంతమైన ఈ కలయికలో వచ్చిన నాలుగో చిత్రమే ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా ఆరేళ్ల తర్వాత ఈ చిత్రంతో పునః ప్రవేశం చేసింది. ఇందులో రవితేజ మూడు అవతారాల్లో సందడి చేయబోతున్నాడని పేరు, ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది. మరి ‘అమర్ అక్బర్ ఆంటొని’ల కథేమిటి? రవితేజ, శ్రీనువైట్ల కలిసి ఏ స్థాయిలో నవ్వించారు?
ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్ అరోరా), సబూ మీనన్ (ఆదిత్య మీనన్), విక్రమ్ తల్వార్ (విక్రమ్‌జీత్) , రాజ్ వీర్‌ల నిజస్వరూపం తెలియని ఆనంద్, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్ అయిన వెంటనే ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్(షాయాజీ షిండే) సాయంతో అమర్, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ.
రెండు శతాబ్దాల క్రితం బ్రిటిష్ పాలన కాలంలో దేశవ్యాప్తంగా కొన్ని ముఠాలు దారి దోపిడీలతో గడగడలాడించాయి. వారిని థగ్స్ (దోపిడీ దొంగలు) అని పిలిచేవారు. వారు బ్రిటిష్ ఖజానాను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ప్రభుత్వం వారిపై దృష్టిపెట్టింది. థగ్గులను ఏరిపారేయడానికి ప్రత్యేకంగా కొందరు అధికారులను నియమించింది. వారు థగ్గులను అణచివేయడానికి కర్కశంగా వ్యవహరించిన ఉదంతాలూ ఉన్నాయి. ఈ నేపథ్యానికి కల్పిత సంఘటనలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థగ్గుల బృందానికి కమాండర్‌గా ఖుదాబక్ష్ ఆజాద్ పాత్రలో అమితాబ్, ఫిరంగి అనే జిత్తులమారి థగ్గుగా ఆమిర్, విలువిద్యలో ఆరితేరిన జఫీరా అనే థగ్గుగా ఫాతిమా సనా షేక్ నటించారు. థగ్గులను అణగదొక్కడానికి వచ్చిన కర్కశ అధికారి జాన్ క్లైవ్‌గా హాలీవుడ్ నటుడు లాయిడ్ ఓవెన్ నటించారు. సురైయ్యా అనే అందమైన నర్తకిగా కత్రినా కైఫ్ నటించారు. ఆకాలంలోని బ్రిటిష్ ముఠాలను తరిమికొట్టడానికి ఈ థగ్స్ ఏం చేశారు? తదితర విషయాలను తెరపై చూడాలి.
రవితేజ ఇందులో కొంచెం కొత్తగా కనిపించాడు కానీ.. అతను పెద్దగా చేసిందేమీ లేదు. రవితేజ కొత్తగా కనిపించాలని కోరుకుంటాం కానీ.. అతను ఇంత నిస్సహాయంగా.. డల్లుగా ఉండటం ప్రేక్షకులకు రుచించదు. చాలాచోట్ల రవితేజ క్లూ లెస్ గా కనిపించాడు. అతడిలో ఎప్పుడూ ఉండే ఎనర్జీ ఇందులో కనిపించలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అతడికి సెట్టవ్వలేదు. పాత్రలో వైరుధ్యం చూపించాల్సిన సన్నివేశాల్లో రవితేజ తేలిపోయాడు. ఇలియానా సెక్సీగా కనిపించింది కానీ.. ఫిజిక్ మాత్రం చాలా చోట్ల ఎబ్బెట్టుగా తయారైంది. మరీ లావైపోయిన ఇల్లీని చూసి అభిమానులు తట్టుకోలేరేమో. నటన పరంగా ఇలియానా బాగానే చేసింది. విలన్లుగా ఒకరికి నలుగురు కనిపించారు కానీ.. ఎవ్వరూ ప్రత్యేకంగా కనిపించలేదు. ఒక్క పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. ఎఫ్బీఐ ఆఫీసర్ గా అభిమన్యు సింగ్ మామూలు ఓవరాక్షన్ చేయలేదు. అతడి పాత్ర విసిగిస్తుంది. సత్య.. వెన్నెల కిషోర్.. సునీల్ ల కామెడీ పర్వాలేదు. మిగతా నటీనటులంతా మామూలే.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
పంచ్ లైన్: ‘అమర్ అక్బర్ ఆంటొని’ అయోమయం ఆందోళన!
రేటింగ్ : 2.5/5
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీపై మీ అభిప్రాయం చెప్పండి ?