Home / Political / అమరావతి లో పవన్ పర్యటన

అమరావతి లో పవన్ పర్యటన

Author:
ఎపి రాజధాని అమరావతి లో ఆదివారం పర్యటించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడ వెళ్లి, అక్కడ నుంచి అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. భూసేకరణ చట్టం ద్వారా భూములు సేకరించవద్దని పవన్ కళ్యాణ్ సూచించినా వినకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో పవన్ పర్యటించక తప్పలేదని జనసేన వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఉండవల్లి,పెనుమాకతో మరో గ్రామంలో కూడా పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోనున్నారు. పవన్ కళ్యాణ్ కలిసి ఒప్పిస్తామని టిడిపి నేతలు మీడియా ద్వారా చెప్పినా పర్యటన మాత్రం ఆగలేదు. భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ కళ్యాణ్ తొలి నుంచీ చెప్తునూ ఉన్నారు. కానీ వాళ్లకే వదిలేస్తే మిగతా రైతులు పరిస్థితి ఏంటని అధికార పక్షం వాదిస్తుంది. ఆ మూడు గ్రామాల్లో వైసిపికి మెజార్టీ వచ్చిందని, జగన్ రెచ్చగొట్టడం వల్లే భూములు ఇవ్వడం లేదని టిడిపి ఎమ్మెల్సీ గాలిముద్దుకృష్ణమనాయుడు ఇప్పటికే విమర్శించారు కూడా .అయితే రేపటి పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి. కేవలం ట్వీట్లు కాదు జనసేనకు ఒక ప్రత్యేక కార్యాచరణ ఉందని నిరూపించుకునే అవకాశం, ప్రజల పక్షాన పోరాడే చాన్సు ఇలా వచ్చిందనుకోవాలి. మొత్తం మీద రేపు పవన్ జనసేనకు టీడీపీ కి మధ్య రాజకీయ దుమారం రేగే పరిస్థితి అయితే కనపడుతోంది.
(Visited 34 times, 1 visits today)