Home / General / టెన్త్ విద్యార్హతతో డిగ్రీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం..!

టెన్త్ విద్యార్హతతో డిగ్రీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం..!

Author:

కుటుంబ, ఆర్థిక పరిస్థితుల వల్ల చదువుని మధ్యలోనే వదిలేసిన వారు చాలామంది ఉంటారు, అలాంటి వారి కోసం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక మంచి అవకాశాన్ని కల్పించింది, టెన్త్ లేదా ఇంటర్ వరకు చదివి ఆపేసిన వారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా B.A , B.sc , B.com కోర్సులని చదవొచ్చు, ఈ కోర్సులలో జాయిన్ అవ్వడానికి 18 సంవత్సరాలు నిండి టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ఉంటే చాలు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేసారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధ్యాయన కేంద్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీలలో చేరడానికి నిర్వహించే అర్హత పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కో-ఆర్డినేటర్ తెలిపారు. అర్హత పరీక్ష రాయడానికి ఫీజు రూ.310 నిర్ణయించడం జరిగిందన్నారు. ఫిబ్రవరి 28 తేదీ వరకు రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు ఆఖరు తేదీగా నిర్ణయించడం జరిగిందని, పరీక్షను మార్చి 11వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. 18 సంవత్సరాల వయస్సు, పదోతరగతి పూర్తైన వారు ఏజ్ సర్టిఫికెట్, బోనోఫైడ్, ఫొటోతో స్టడీ సెంటర్ ను సంప్రదించాలన్నారు. అర్హత పరీక్ష రాయాలనుకునే వారు మీ సేవ కేంద్రంలో, ఆన్‌లైన్ ద్వారా రూ.310 చెల్లించి రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్నారు. అధ్యాయన కేంద్రంలో కూడా డైరెక్టుగా డబ్బులు చెల్లించవచ్చని తెలిపారు. దరఖాస్తులను www.braouonline.in లో ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

For Notification Click Here

(Visited 201 times, 1 visits today)