Home / Inspiring Stories / ఏపీకి రెండూ తెలంగాణా కు పదమూడు.

ఏపీకి రెండూ తెలంగాణా కు పదమూడు.

Author:

ఆంధ్ర ప్రదేశ్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాంక్ సోమవారం నాడు ప్రకటించిన భారత దేశంలో వ్యాపార అనుకూల ఇండెక్స్ లో ఆంధ్ర ప్రదేశ్ కు రెండోస్థానంలో నిలబడింది. ఈ జాబితాలో అందరూ ఊహించినట్టే గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఝార్ఖండ్ కు మూడో స్థానం లో నిలిచింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసిందేమితంటే తెలంగాణా కు పదమూడో స్థానం లభించింది. మంచి వ్యాపార అనుకూల వాతావరణం ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో వరుసగా ఛత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఒడిషా, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ కూడా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ కు 11, తమిళ నాడు కు 12 స్థానాలు లభించగా, బీహార్ కు 21, అస్సాం కు 22 స్థానాలు లభించాయి. భారత ప్రభుత్వం కోసం ప్రపంచ బ్యాంక్ రూపొందించిన ఈ ర్యాంకింగ్ లో వ్యాపారం నెలకొల్పడం, భూకేటాయింపు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతుల విధానం వంటి ఎనిమిది అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటిలో తెలంగాణా కి 13 స్థానం ఇవ్వటం కొంత ఆశ్చర్య పడే విషయమే మరి.

అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, పన్నుల కోసం నమోదు చేసుకొనే పద్ధతి, నిబంధనల ఉల్లంఘనకు జరిగే తనిఖిలను కుడా పరిగణలోకి తీసుకున్న ప్రపంచ బ్యాకు నిపుణుల బ్రందం ఈ మేరకు జాబితా తయారు చేసినట్టు చెబుతోంది. అయితే భారత దేశంలో వ్యాపారం చేయటానికి ఎన్నో అసమంజస పరిస్తితులున్నాయనీ, దీని వల్ల నియంత్రణ భారం అధికంగా పడుతోందనీ ప్రపంచ బ్యాంక్ భారత్ డైరెక్టర్ ఒన్నొ రుహల్ విచారం వ్యక్తం చేశారు. అందుకనే ప్రపంచంలోని 182 దేశాలల్లో భారత్ స్థానం 142 అని ఆయన చెప్పారు. అయితే ఇటీవల కాలంలో వ్యాపారం ప్రారంభించడానికి సంబంధించిన సంస్కరణల అమలు, దివాళా తీస్తే పరిష్కరించడం, చేసుకున్న ఒప్పందాల అమలు, సరిహద్దుల అవతల వ్యాపారం వంటి  అంశాల్లో భారత్ తీసుకుంటున్న పలు చర్యలు పరిస్తితులల్లో కొంత మెరుగుదల తీసుకు రాగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

(Visited 95 times, 1 visits today)