ఏపీకి ప్యాకేజీపై అరుణ్ జైట్లీ ప్రకటన
• విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తుంది
• పార్లమెంట్ సెషన్ తర్వాత ఏపీ మీద దృష్టి పెట్టాం
• విభజన తర్వాత ఏపీ ఆదయం కోల్పోయింది
• పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినప్పటి నుంచి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది
• రాజధానికి ఇప్పటికే రూ. 2,500 కోట్లు ఇచ్చాం -2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరానికి ఎంత ఖర్చయిందో అంతా కేంద్రమే చెల్లిస్తుంది
• విభజన చట్టంలోని ఐదు అంశాలను ఇప్పటికే అమలు చేశాం, చేస్తున్నాం
• ఇక ఆరోది ప్రత్యేక హోదా – మొదటి రెండేళ్ల రెవెన్యూలోటును కేంద్రం ఇచ్చింది
• కొండ ప్రాంతాలు ఈశాన్యరాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక వర్తిస్తుందని నిబంధనలు చెబుతున్నాయి
• 14వ ఆర్థిక సంఘం ఏర్పడిన తర్వాత హోదా ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో దాంతో సమానమైన ప్రయోజనాలు అంతకన్నా ఎక్కువ మేలే ఏపీకి జరిగేలా చూస్తున్నాం
• ఏపీకి ఏమి చేస్తున్నామో రేపు ప్రకటన విడుదల చేస్తాం
• ఏపీలో ఇప్పటికే సెంట్రల్ యూనివర్శిటీలు ఏర్పాటు చేశాం – కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైనా ఇప్పటికే గ్రౌండ్ లెవల్ రిపోర్టు ఉంది
• త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం – ఏపీకి కేంద్ర సహాయ సహకారాలు నిరంతరం అందాల్సి ఉంది
• విభజన చట్టంలోని అన్ని అంశాలను గౌరవిస్తాం – ఏపీకి ఏమి చేస్తున్నామో రేపు ప్రకటన విడుదల చేస్తాం
• రైల్వే జోన్ ఎక్కడన్నది సురేష్ ప్రభునే తేలుస్తారు
• లోటు భర్తీపైన నీతి ఆయోగ్ , ఏపీ చర్చించుకుని ఓ అభిప్రాయానికి వస్తాయి : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ