Home / Videos / Video: కేంద్ర మంత్రి వీవీఐపీ కల్చర్ కి ఎదురుతిరిగిన మహిళ..!

Video: కేంద్ర మంత్రి వీవీఐపీ కల్చర్ కి ఎదురుతిరిగిన మహిళ..!

Author:

మనదేశం ఎన్నో రకాలుగా మార్పులు చెందుతున్న రాజకీయ నాయకులూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని వీవీఐపీ కల్చర్ ని అనుభవించే విషయంలో మాత్రం ఎటువంటి మార్పులు రావట్లేదు, సాక్షాత్తు ప్రధానమంత్రే వీవీఐపీ కల్చర్ ని వీడి సామాన్య ప్రజలుగా ఉండాలని ప్రకటించిన కూడా కొంతమంది రాజకీయ నాయకులలో ఎటువంటి మార్పు రావట్లేదు, ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ మంత్రి యే వీవీఐపీ కల్చర్ ద్వారా సామాన్య ప్రజలని ఇబ్బందులకు గురిచేసిన సంఘటన ఇంఫాల్ ఎయిర్ పోర్ట్ లో జరిగింది, ఈ విషయంలో ఆ సదరు కేంద్ర మంత్రిని ఒక మహిళ నిలదీసింది కూడా…

వీవీఐపీ కల్చర్

మణిపూర్ రాజధాని ఇంపాల్ ఎయిర్ పోర్ట్ లో ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్ దిగారు. ఈయన రాకతో మిగతా విమాన ప్రయాణికులను నిలిపివేశారు. విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. మంత్రి రాకతో ఆలస్యం అయిన ప్రయాణికుల్లో ఓ మహిళా డాక్టర్ ఉన్నారు. అత్యవసరంగా ఓ పేషెంట్ కి ఆపరేషన్ చేసేందుకు వెళ్లటానికి ఆమె ఎయిర్ పోర్ట్ కి వచ్చింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సంస్కృతి, పర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ వల్ల ఆలస్యం అయ్యిందని తెలుసుకుంది. ఆయన ఎయిర్ పోర్ట్ లోకి వచ్చిన తర్వాత అడ్డుకుని నిలదీసింది. మీ వల్లే విమానాలు ఆలస్యం అయ్యాయని మండి పడింది. VVIP కల్చర్ లేదని ప్రధాని మోడీగారు చెబుతుంటే.. మీరు ఇలా చేయటం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీసింది. తప్పు అయ్యింది.. మరోసారి ఇలా జరగదు అని రాసివ్వాలని పట్టుబట్టింది. భద్రతా సిబ్బంది, ఎయిర్ పోర్ట్ అధికారులు ఎంత సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె కోపం కంట్రోల్ కాలేదు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రిని పట్టుబట్టింది. పెద్దపెద్దగా మాట్లాడుతూ మంత్రిని నిలదీసింది. ఓ డాక్టర్ గా పేషెంట్ బాధ ఏంటో నాకు తెలుసు.. మీలాంటోళ్ల వల్ల ఓ కుటుంబ బాధపడాల్సి వస్తుందని ఏడుస్తూ చెప్పింది. మరోసారి తప్పు జరగదని లేఖ రాసి ఇవ్వాలని పట్టుబట్టింది. దీనికి ససేమిరా అన్న కేంద్రమత్రి కన్నన్ థానమ్.. యువతిని సముదాయించి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ రాజకీయ నాయకులలో ఇంకా ఎన్నాళ్లకు మార్పు వస్తుందో…!

(Visited 542 times, 1 visits today)