అనుష్క వెంట వెంట వరుస హిట్ లతో హీరో లతో సమానం గా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈ అందాల బొమ్మ బొద్దు గుమ్మ గా మారి చేసిన సినిమా సైజ్ జీరో అన్న సంగతి తెలిసిందే కదా… ఈ సినిమా ఆడియో వేడుక నిన్న రాత్రి హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. పాటల ఆవిష్కరణ అనంతరం రాజమౌళి మాట్లాడుతూ వేడుకకు వచ్చిన అతిథులు వెయిట్ మిషన్ పై నిలబడి వెయిట్ చూసుకుని, ఎక్సర్ సైజ్ సైకిల్ ను తొక్కి పాటలను విడుదల చేశారు. కార్య్రకమానికి అతిథులుగా కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి, దిల్‌రాజు,రానా, గుణ్ణం గంగరాజు, బి.గోపాల్, వంశీపైడిపల్లి, గోపీచంద్ మలినేని, దశరథ్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ లతో పాటు యూనిట్ సభ్యులు అనుష్క, ఆర్య, అలీ, సోనాల్ చౌహాన్, నిరవ్ షా, కణిక, ప్రకాష్ కోవెలమూడి, పరమ్ వి.పొట్లూరి తదితరులు హాజరయ్యారు. ఎస్.ఎస్.రాజమౌళి థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బిగ్ సీడీని, ఆడియో సీడీలను కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ…బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఓ రోజు అనుష్క ఈ సబ్జెక్ట్ ఒక సారి నాతో చెప్పింది. తను చెప్పిన పాయింట్ అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ తను మంచి సినిమా చేస్తున్నాననే ఆనందం లో ఉంది అని మాత్రం అనిపించింది. ట్రైలర్స్ ను ఎప్పుడో చూసేశాను. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్రైలర్ తోసినిమా చూడాలనే ఎగ్జయిట్‌మెంట్ కలిగించారు. ప్రసాద్ పొట్లూరి గారు మంచి ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ తో సినిమాను నిర్మించారు. అలాగే ప్రకాష్ కోవెలమూడి ఏ సినిమా చేసినా సిన్సియర్‌గా నమ్మి చేస్తాడు. కణిక మంచి స్టోరీని ప్రొవైడ్ చేసింది. ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది… అన్నారు…
ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అంటూ చెప్పారు ఈ సినిమాలో హీరో గా చేసిన ఆర్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బి.గోపాల్, దశరథ్, వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని తదితరులు చిత్రయూనిట్ ను అభినందించారు. అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్, పోసాని కృష్ణమురళి, భరత్,బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: యం.యం.కీరవాణి,
సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా,
కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి,
నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే,
దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.