Home / Inspiring Stories / కేవలం 150/- రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్,ఫోను కనెక్షన్.

కేవలం 150/- రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్,ఫోను కనెక్షన్.

Author:

ఇప్పుడు ఇంటర్ నెట్ అనేది నిత్యావసరాల జాబితాలో అతి ముఖ్యమైన విషయం, ఇంటర్నెట్ లేకపోతే సగం ప్రపంచం ఆగిపోయినట్లే ఉంటుంది, ప్రభుత్వ, ప్రైవేట్ పనులలో 70 శాతం వరకు ఆన్ లైన్ లో జరుగుతున్నాయి, అందుకే ఇంటర్ నెట్ ఆవసరాన్ని గుర్తించిన మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా హైస్పీడ్‌ ఇంటర్ నెట్ అందించాలని ప్రతిపాదించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ హైస్పీడ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ) నెట్‌వర్క్‌ పనులని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. అయితే కేంద్రం ప్రతిపాదించిన విధానం వల్ల భారీ వ్యయం, ఏళ్ల సమయం పడుతుంది. దీంతో.. కేంద్రం అందించే సాయాన్ని ఆలంబనగా తీసుకుని తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎ్‌ఫసీ) ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్‌, ఫోన్‌ సౌకర్యం, కేబుల్‌ కనెక్షన.. రూ.150లకే ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో దాదాపు రెండు కోట్ల కుటుంబాలకు ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటుచేశారు. సుమారు రూ.330 కోట్లతో 13 జిల్లాల్లో పనులు జరుగుతున్నాయి. మొత్తం 23 వేల కిలోమీటర్ల పొడవునా ఎ24 కోర్‌-ఏడీఎ్‌సఎస్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌ను 33 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్‌ స్తంభాలకు అమర్చే పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఈ కేబుల్స్‌ను 2,449 సబ్‌స్టేషన్‌లలో సర్వర్‌లకు కలుపుతారు. విద్యుత్‌ ప్రవహించే లైనుకు మూడు అడుగుల దిగువన క్లాంపులు బిగించి దానికి కేబుళ్లు అమర్చుతున్నారు. సబ్‌స్టేషన్‌లలోని సర్వర్‌ నుంచి స్థానికంగా ఉండే కేబుల్‌ ఆపరేటర్లు ఇప్పటికే ఏర్పాటుచేసిన కేబుల్‌ ద్వారా ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు.

AP-Fiber-Grid-Project-internet-connection-for-150-rupees-only

కేవలం 150 రూపాయలకు ప్రతి ఇంటికీ 10 నుంచి 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో నెట్‌ డేటా పరిమితి 5 జీబీ), 100 ఉచిత చానళ్లతో కేబుల్‌ సౌకర్యం, ఇదే (ఫైబర్‌ నెట్‌) సదుపాయం కలిగి ఉన్న వేరొకరితో (ఆన్‌ నెట్‌) ఉచితంగా ఫోన్‌లో మాట్లాడుకునే సదుపాయం. ఆన్‌నెట్‌లో రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచితంగా ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఫైబర్‌నెట్‌లో లేని ఫోన్లకు, సెల్‌ఫోన్లకు ఫోన్‌ చేస్తే అదనపు రుసుం వసూలు చేస్తారు.

ఈ రోజులలో ఇంటర్ నెట్ కనక్షన్ కావాలంటే నెలకి రూ. 500/- కట్టాల్సిందే, అందుకే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న రూ.150/- కే ఇంటర్నెట్ కనక్షన్ ని అన్ని జిల్లాల ప్రజలు ముఖ్యంగా యువకులు స్వాగతిస్తున్నారు, ఈ పథకం పూర్తిగా అమలు అయితే చంద్రబాబు నాయుడుని ఎందుకు హైటెక్ ముఖ్యమంత్రి అంటారో మరోసారి తెలియజేసినట్టు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

(Visited 2,863 times, 1 visits today)