Home / General / న్యూ ఇయర్ రోజు ఎలాంటి వేడుకలు చెయ్యొద్దు…! ప్రభుత్వం ఆదేశం..!

న్యూ ఇయర్ రోజు ఎలాంటి వేడుకలు చెయ్యొద్దు…! ప్రభుత్వం ఆదేశం..!

Author:

కొత్త సంవత్సరం వస్తుంది అంటే అందరు ఫుల్ జోష్ లో కొత్త వెల్ కమ్ చెప్తుంటారు, అర్ద్రరాత్రి వరకు మేల్కొని ఉండి నూతన సంవత్సర సెలెబ్రేషన్స్ ఘనంగా చేసుకుంటారు, అన్ని దేవాలయాల్లో కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పులజు కూడా చేస్తుంటారు, కానీ ఈసారి అలా దేవాలయాల్లో స్పెషల్ పూజలుకి ఆవకాశం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీ జరిగే వేడుకలను రద్దు చేసింది. ఆలయాల్లో ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయొద్దని ఏపీ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యథావిధిగానే.. రోజువారీగానే టెంపుల్స్ అన్నీ మూసివేయాలని దేవాదాయ శాఖకి చెందిన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆదేశాలు ఇచ్చింది. అన్ని ఆలయాలకు నోటీసులు ఇచ్చింది.జనవరి ఒకటి అనేది పాశ్చాత్య సంస్కృతి అని.. తెలుగు వాళ్ళకి నూతన సంవత్సరం అంటే ఉగాది కావున జనవరి 1 న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దేవాలయాల్లో ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయవద్దని స్పస్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఏపీ ఆర్డర్ : న్యూఇయర్ అంటే ఉగాదే.. వేడుకలు వద్దు

జనవరి ఒకటో తేదీ అర్థరాత్రి 12 గంటలకు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ దైవ దర్శనం చేసుకుంటారు లక్షల మంది ప్రజలు. ఇదో సెంటిమెంట్ గా భావిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు చాలా ఆలయాలు తెరిచే ఉంచుతున్నారు. ఇక నుంచి అలా కుదరదని చెబుతోంది ఏపీ దేవాదాయశాఖ. సెలబ్రేషన్స్ జరుపుకోవటం హిందూ ఆచారం కాదని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆ రోజున ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని ఆలయాలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం జనవరి ఒకటిన లక్షల మంద ఆలయాలకు వస్తున్నారు. ఉగాది పండుగ రోజున.. తెలుగు ప్రజలకు కొత్త ఏడాది ప్రారంభం అవుతుందని.. ఆ రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. కమిషన్ వై.వి.అనురాధ పేరుతో ఈ సర్క్యులర్ జారీ అయ్యింది. ఈ నోటీసులు వివాదాస్పదం అవుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉంటారని.. ఆ రోజునే అలా చేసుకోవాలని ఆంక్షలు పెట్టటం ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

(Visited 240 times, 1 visits today)