Home / Political / అతి వేగమే ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ మృతికి కారణం.

అతి వేగమే ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్ మృతికి కారణం.

Author:

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిషీత్‌ నారాయణ మరియు అతడి స్నేహితుడు రాజా రవిచంద్ర ఈరోజు హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయానిస్తున్న బెంజ్‌ కారు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో ఉన్న మెట్రో రైలు పిల్లర్ ని అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటణలో తీవ్రంగా గాయపడిన నిషీత్‌, రాజా రవిచంద్ర లను ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఉదయం 2 గంటల 42 నిముషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నిషీత్ మృతి విషయం తెలియగానే మంత్రి నారాయణ లండన్ నుండి తిరుగు ప్రయాణమయ్యారు. శోక సంద్రంలో మునిగిన నారాయణ కుటుంబీకులను రెండు రాష్ట్రాల ప్రముఖ నాయకులు పరామర్శించారు. నిషీత్ అంత్యక్రియలు రేపు నెల్లూరులో జరుగనున్నాయి.

రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో నిషీత్ నడుపుతున్న బెంజ్ జి-63 కారు భద్రతా పరంగా చాల ఉత్తమమైనది. తెలంగాణలో టీఎస్ 07 ఎఫ్కే 7117 నంబర్ తీ రిజిష్టర్ అయిన ఈ కారు ఖరీదు రెండు కోట్ల రూపాయిలకు పైనే ఉంటుందని సమాచారం. బెంజ్‌లో అత్యున్నత శ్రేణికి చెందిన ఈ కారు ప్రమాదం లో నుజ్జునుజ్జైపోయింది దీనిని బట్టే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు. ప్రమాదం జరిగిన తరువాత అయిర్ బ్యాగులు ఒపెన్ అయినప్పటికి ప్రమాద తాకిడికి అవి వెంటనే పేలి పోయాయి అంతే కాకుండా ముందు ఉండే ఇంజిన్ భాగాలు కారు లోపలికి తోసుకుని రావడంతో ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగం వలన ఖరీదైన కారు కూడా నిషీత్ ప్రాణాలు కాపాడలేకపోయింది.

(Visited 4,918 times, 1 visits today)