Home / Political / సోషల్ మీడియా సాక్షిగా రగులుతున్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రగడ.

సోషల్ మీడియా సాక్షిగా రగులుతున్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ రగడ.

Author:

జల్లికట్టు కోసం తమిళులు పట్టిన పట్టు ఇతరులలో కూడా స్పూర్తిని రగుల్చుతోంది. రాష్ట్ర విభజన సంధర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ కి రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు. నాయకులలో లోపించిన కార్యదక్షత కారణంగా ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి దక్కింది కాని హోదా వలన కలిగే ప్రయోజనాలు రాష్ట్ర ప్రజలు పొందలేకపోతున్నారు. ఎన్నికల హామిలో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన పార్టీలు మాట మార్చాయి దీనిపై కొన్నాళ్ళు పోరాటం చేసిన వివిద సంఘాలు ఇక అది రాదు అని తెలిసాకా తమ ఆందోళనలను విరమించాయి. కాని జల్లికట్టుపై నిషేదం ఉన్నా తమ ఐక్యతతో, శాంతియుత నిరసనలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని రూల్స్ మార్చేలా చేసినా తమిళ యువత స్పూర్తితో మన తెలుగు యువత కూడా ఆందోళనలు చేయాలని భావిస్తొంది.

ap special status is trending in social media

తమిళుల నిరసనలు అంత విజయవంతం అవటానికి సోషల్ మీడియానే కారణం, ఫేస్ బుక్, ట్విట్టర్ మరియు ఇతర సైట్ల ద్వారా నిరసన వివరాలు షేర్ చేసుకున్న యువత అందరూ అనుకున్నట్లుగా చెన్నై మెరీనా బీచ్ కి చేరారు. తమకు తెలిసిన పద్దతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఒకే మాట మీదా నిలబడ్డారు. అంతే కేంద్రం దిగిరాకా తప్పలేదు. ఇప్పుడు ఆంధ్రకు కూడా మొండిచేయి చూపినా కేంద్రానికి ఇదే తరహాలో బుద్దిచెబుదామని సోషల్ మీడియాలో విసృతంగా పోస్టులు పుట్టుకొస్తున్నాయి. ఫేస్ బుక్ లో అందరూ తమ ఫోటో ను స్పెషల్ స్టేటస్ ఆంధ్రుల హక్కు అన్న నినాదంగా మార్చుతున్నారు. ట్విట్టర్లో దీనికి సంభంధించిన పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. జనవరి 26 న అందరూ స్వచ్చందంగా విశాఖ తీరానికి రావలన్న మెసేజ్ బాగా సర్కులేట్ అవుతోంది. ఈ నాలుగు రోజుల్లో యువత ఈ మెసేజ్ తో ఇలాగే ముందుకుసాగితే తమిళనాడు తరహా ఉద్యమం మన దగ్గర కూడా మొదలవ్వచ్చు.

(Visited 362 times, 1 visits today)