Home / Reviews / అప్పట్లో ఒకడుండేవాడు సినిమా రివ్యూ & రేటింగ్.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమా రివ్యూ & రేటింగ్.

appatlo-okadundevadu-movie-review

Alajadi Rating

3.25/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: రా రోహిత్ - శ్రీ విష్ణు - తన్య హోప్ - బ్రహ్మాజీ - ప్రభాస్ శీను - రాజీవ్ కనకాల - అజయ్ - సత్యదేవ్ - సత్యప్రకాష్ - రవి వర్మ - మానస - రాజ్ మాదిరాజు తదితరులు

Directed by: సాగర్ చంద్ర

Produced by: కృష్ణ విజయ్ - ప్రశాంతి

Banner: అరన్ మీడియా వర్క్స్

Music Composed by: సాయికార్తీక్

విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న నారా రోహిత్ , ‘అయ్యారే’ అనే వైవిధ్యమైన సినిమా తీసిన సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘ అప్పట్లో ఒకడుండేవాడు ‘ అనే సినిమాని తెరకెక్కించాడు, సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండే జనాలలో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి, నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రదారులుగా నటించిన ఈ సినిమా ఈరోజే విడుదల అయింది, సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

appatlo-okadundevadu-movie-review

కథ :

రైల్వే రాజు (శ్రీ విష్ణు) చిన్నప్పటి నుండి క్రికెట్ ఆడుతూ ఎలాగైనా జాతీయ జట్టులో ఆడాలని కలలు కంటూ ఉంటాడు, అందుకోసం ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, నిత్యా (తన్య హోప్) అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు, జాతీయ జట్టులోకి ఎంపిక అయ్యే సమయంలో రైల్వే రాజు జీవితంలోకి ఇంతియాజ్ అలీ (నారా రోహిత్) అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఒక కేసులో రైల్వే రాజుకి సంబంధం లేకున్నా అతనిని ఆరెస్ట్ చేస్తాడు, అక్కడ్నుంచి రాజు జీవితమే మారిపోతుంది, క్రికెటర్ కావల్సిన రైల్వే రాజు గ్యాంగ్ స్టర్ గా మారిపోతాడు, రైల్వే రాజుని ఇంతియాజ్ అలీ ఎందుకు టార్గెట్ చేసాడు..? వీరి పోరాటంలో ఎవరు గెలిచారు..? అన్నది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

ఒక కథని చెప్పేటప్పుడు మనకి అవి నిజ జీవితంలో జరిగినట్టే అనిపించడం చాలా అరుదు, కొన్ని సినిమాలలోనే అలాంటి ఫీల్ ఉంటుంది, అలాంటి సినిమాల జాబితాలో అప్పట్లో ఒకడుండేవాడు సినిమా కూడా ఉండాల్సిందే, సినిమా నడుస్తున్నంత సేపు స్క్రీన్ పై కనిపించే కథనంతో మనం కనెక్ట్ అయిపోతాం, ఫస్ట్ ఆఫ్ లో రైల్వే రాజు పాత్రలో మనల్ని గాని క్రికెట్ బాగా ఆడే ఫ్రెండ్ ని ఉహించుకుంటాం, అంతలా ప్రభావితం చేస్తుందా పాత్ర.

ఇంతియాజ్ అలీ పాత్ర వచ్చే వరకు సినిమా సాఫీగానే సాగుతుంది, ఇంతియాజ్ అలీ, రైల్వే రాజు ల మధ్య జరిగే మైండ్ గేమ్ తో, పోరాటాలతో సినిమా ఎక్కడికో వెళ్తుంది, రైల్వే రాజు గ్యాంగ్ స్టర్ గా మారిపోవడానికి దారితీసిన పరిస్థితులని అద్భుతంగా చూపించారు, ఇక క్లైమాక్స్ కి వచ్చేసరికి సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది, సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు అంతా అద్భుతంగా క్లైమాక్స్ ని మలిచారు. థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఒక వైవిధ్యమైన సినిమా చూసాం అనే ఫీలింగ్ తో వస్తాం.

నటీనటుల పనితీరు:

నారా రోహిత్: తనకి అచ్చొచ్చిన సీరియస్ పాత్రలో నారా రోహిత్ జీవించాడు, ఇంతియాజ్ అలీ అనే పోలీస్ క్యారెక్టర్ కి తాను తప్ప మరొకరు న్యాయం చేయలేరు అనేంతలా ప్రభావితం చేసాడు.

శ్రీ విష్ణు: శ్రీ విష్ణు చేసిన రైల్వే రాజు పాత్ర కొన్ని సంవత్సరాలు నిలిచిపోతుంది, ఈ సినిమాతో శ్రీ విష్ణు సినిమా కెరీర్ ఖచ్చితంగా టర్న్ అవుతుంది, సినిమా మొత్తం తనే కనిపిస్తూ అద్భుతంగా నటించాడు.

ఇంకా బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి , రాజీవ్ కనకాల తదితరులు కూడా బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్: 

  • కథ , స్క్రీన్ ప్లే
  • నారా రోహిత్, శ్రీ విష్ణు ల నటన
  • కెమెరా వర్క్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

  • పాటలు
  • అక్కడక్కడా కొన్ని సీన్స్

అలజడి రేటింగ్: 3.25 /5

పంచ్ లైన్ : అప్పట్లో ఒక మంచి సినిమా చూసాం అని ఫ్యూచర్ లో చెప్పుకోవచ్చు.

(Visited 1,505 times, 1 visits today)