ప్రపంచాన్ని అబ్బుర పరచటానికి అరబ్బులు తెగ తాపత్రయ పడిపోతూంటారు. బుర్జ్ ఖలీఫా హొటల్ ని 1000 అడుగుల ఎత్తుతో నిర్మించినా, గాల్లో వేలాడే టెన్నిస్ కోర్టుని కట్టినా దుబాయ్ తన ప్రత్యేకతని చాటు కుంటూనే ఉంటుంది. ఇప్పుడు దుబాయ్ లో రూపుదిద్దుకుంటున్న కొత్త అద్బుతమేంటో తెలుసా..!? “అండర్ వాటర్ టెన్నిస్ కోర్టు”. పోలిష్ ఆర్కిటెక్ట్ “క్రిస్జ్టాఫ్ ఖోటాల” ఆద్వర్యం లో బుర్జ్ అల్ అరబ్ మరియు ఫాంజుమైరాహ్ దీవుల మధ్య పర్షియన్ గల్ఫ్ లో నీటి అడుగున క్లిష్టమైన ఈ టెన్నిస్ కోర్ట్ నిర్మించడానికి ప్రతిపాదించింది.
అర్థ చంద్రాకారం లో పూర్తికా కవర్ చేస్తూ ఉండే పైకప్పు రెండు పొరలు గా ఉండి నీటితో నింపబడి ఉంటుంది. పూర్తి గాజు తో ఉండే ఈ పైకప్పు రెండు పొరల మధ్యనా ఉండే నీళ్ళలో చేపలూ,పగడపు దిబ్బలూ(కోరల్ రిఫ్స్) ఇంకా కొన్ని జలచరాలూ ప్రేక్షకులకీ, ఆటగాళ్ళకీ కనువిందు చేయనున్నాయి..
ఈ అద్బుతమైన నిర్మాణం దుబాయ్ సిగలో మరో రికార్డ్ బ్రేకింగ్ నిర్మాణం గా మారనుంది. ఐతే ఇంత భారీ నిర్మాణాన్ని పూర్తి చేయటం ఇంజినీర్లకూ సవాల్ గానే మారింది. ఇది పూర్తి చేయటం అంటే ఒక పెద్ద సాహసమే అంటున్నారు నిర్మాణరంగ నిపుణులు. అంతే కాదు నీతి అడుగున నిర్మించే ఈ క్రీడా పాంగణాల్లో కి వచ్చే ప్రేక్షకుల,ఆటగాళ్ళ భద్రత పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.. కానీ ఆర్టికిటేక్ట్ కొటాలా గారు మాత్రం తనదగ్గర వీటన్నిటికీ సమాధనాలున్నాయ్ అంటున్నాడు.